• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వాల్తేర్‌ వీరయ్య’లో రవితేజ మాస్‌ యాటిట్యూడ్‌

    బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’లో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రవితేజ పాత్రకు సంబంధించి టీజర్ విడుదల చేశారు. మాస్‌ యాటిట్యూడ్‌తో రవితేజ ఇరగదీశాడు. ‘ఏం రా వారీ పిసా పిస జేస్తున్నవ్, నీకింకా సమజ్ గాలే నేను ఎవ్వనయ్యక్ ఇననని’ అంటూ రవితేజ డైలాగ్‌ ఆకట్టుకుంది.

    నటి ఉర్ఫీ జావెద్‌ ఎక్స్‌పోజింగ్‌పై కేసు

    హిందీ బుల్లితెరపై నటిస్తూ.. విచిత్రమైన వస్త్రధారణతో పాపులర్ అయిన నటి ఉర్ఫీ జావెద్. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లోనూ ఈ బ్యూటీ పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తన ఫ్యాషన్ సెన్స్ పై రకరకాల కామెంట్లు వస్తుంటాయి. అయినా ఈ అమ్మడు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోతుటుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఆమె వస్త్రధారణ అశ్లీలంగా ఉందంటూ లాయర్‌ అలీ కాసిఫ్ ఖాన్‌ అందేరీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే తమకు కంప్లయింట్‌ అందిందని పోలీసులు … Read more

    బాలయ్యతో బాహుబలి

    [VIDEO](url):నటసింహం బాలయ్య సూపర్‌ హిట్‌ టాక్‌ షోలో ప్రభాస్‌ సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఆహాలో అనౌన్స్‌ చేసిన కొద్ది నిమిషాల్లో ట్విట్టర్‌ ఈ వార్త ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రభాస్‌, బాలయ్య షాట్లతో ఓ అనౌన్స్‌మెంట్‌ వీడియోను కట్‌ చేసే ఆహాలో పోస్ట్ చేశారు. మొహమాటానికి మారుపేరైన ప్రభాస్‌, బాలయ్య మాటల తూటాలను ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి. The Bahubali episode #Unstoppable Season 2 is coming soon ?Watch out for more updates ✌?#UnstoppableWithNBKS2 … Read more

    చివరి మ్యాచ్‌లో రొనాల్డో కన్నీటిపర్యంతం

    [VIDEO](url): వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో తన చివరి మ్యాచ్‌ అనంతరం ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కన్నీంటి పర్యంతమయ్యాడు. మొరాకో చేతిలో 1-0 ఓటమి అనంతరం రొనాల్డో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆఫ్రికా దేశంగా చరిత్ర లిఖించిన మొరాకో, పోర్చుగల్‌కు షాక్‌ ఇచ్చింది. మ్యాచ్‌ అనంతరం గ్రౌండ్‌ నుంచి టన్నెల్‌కు వెళ్తున్నంతసేపు రొనాల్డో ఏడుస్తూనే కనిపించాడు. https://twitter.com/i/status/1601622668775591937

    19 ఏళ్ల Jr.NTR ప్రభంజనానికి 19 ఏళ్లు

    19 ఏళ్ల వయసులోనే సింహాద్రి వంటి సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత జూ.ఎన్టీఆర్‌ నుంచి వచ్చిన సినిమా ‘ఆంధ్రావాలా’. పూరీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పెద్ద ఎన్టీఆర్‌ స్వస్థలమైన నిమ్మకూరులో ఈ వేడుక నిర్వహించారు.10 ప్రత్యేక రైళ్లు, వేలల్లో బస్సులు కేటాయించినా ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి ఫ్యాన్స్‌కు సరిపోలేదంటే ఆ జన సంద్రం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గుడివాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి చేరుకునేందుకు … Read more

    ప్రవీణ్‌..చూడు చనిపోతున్నా!

    [VIDEO](url): డబుల్‌ బెడ్రూం ఇల్లు రాకుండా కౌన్సిలర్‌ అడ్డుకుంటున్నాడనే మనస్తాపంతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన సిద్దిపేటలో జరిగింది. గణేశ్‌నగర్‌కు చెందిన రమేశ్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేసుకుంటుండగా, ఆయన భార్య పొరగుసేవల విభాగంలో నర్సుగా చేస్తోంది. తనకు డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరైనట్లు 4 సార్లు లిస్టులో పేరు వచ్చినా కౌన్సిలర్‌ అడ్డుకున్నాడని బాధితుడు వాపోయాడు. అయితే రమేశ్ డబుల్‌ బెడ్రూం ఇల్లుతో గానీ, ఆత్మహత్యతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని కౌన్సిలర్‌ ప్రవీణ్‌ చెప్పాడు. తెరాస నాయకుల రాక్షసత్వానికి మరో … Read more

    వైభవంగా హన్సిక వివాహ వేడుక

    దేశముదురులో వైశాలిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన హన్సిక, తన మనసులు దోచుకున్నవాడితో ఏడడుగులు వేసింది. జైపూర్‌లోని రాజకోట వేదికగా ఆదివారం రాత్రి సింధి సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. సోహైల్‌, హన్సిక చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే తమ పెళ్లిని ప్రకటించిన ఈ జంట ఆదివారం ఒక్కటైంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan) … Read more

    ఎగిరి ఎగిరి తన్నుకున్న ఎంపీలు

    [VIDEO](url): దేశ పార్లమెంట్‌ సాక్షిగా ఎంపీలు ఎగిరి ఎగిరి తన్నుకున్నారు. సెనెగల్‌ పార్లమెంట్‌లో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. సెనెగల్‌ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్‌ సంబ్‌, మరో పార్లమెంట్‌ సభ్యురాలు యామి నదియా గింబేను చెంపదెబ్బ కొట్టడంతో గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు కుర్చూలు విసురుకుంటూ తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague* The brawl began when opposition member Massata Samb walked … Read more

    దొంగ సమాధానాలకు అవాక్కైన పోలీసులు

    [VIDEO](url):చత్తీస్‌గఢ్‌ లోని దుర్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ దొంగ చెప్పిన సమాధానాలకు పోలీసులు అవాక్కయ్యారు. ఓ చోరీ చేసి దొరికిన దొంగను అధికారి అందరి ముందే విచారించాడు. దొంగిలించిన సొమ్ముఎంత వచ్చింది? ఏం చేశావ్‌? అని ప్రశ్నించారు. అయితే దానికి అతడు ‘ చోరీ సొమ్ము 10 వేలు వచ్చింది. దొంగతనం చేసేటప్పుడు బాగానే ఉంది గానీ చేశాక తప్పనిపించింది. అందుకే ఆ సొమ్మంతా పేదలకు పంచిపెట్టా, మూగ జీవాలకు ఆహారం కొన్నా’ అంటూ అమాయకంగా చెప్పడంతో పోలీసులతో పాటు అక్కడున్నవారంత ఒక్కసారిగా ఫక్కున … Read more

    ఇంటర్వ్యూలో ఏడ్చేసిన ఆమిర్‌ ఖాన్‌

    ‘లాల్‌ సింగ్‌ చద్దా’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన తర్వాత నటకు విరామం ప్రకటించిన ఆమిర్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇటీవలే కూతురు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించిన ఈ బాలివుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌..పాత రోజులను తలుచుకుని బాధపడ్డాడు. ఆమిర్‌ వాళ్ల నాన్న తాహిర్‌ హుస్సేన్‌ ‘లాకెట్‌’ సినిమా నిర్మిస్తున్న సమయంలో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, పదేళ్ల పిల్లాడిగా తాను ఏమీ చేయలేక లోలోపల మథనపడ్డానంటూ ఎమోషనల్‌ అయ్యాడు.