• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షోరూంలో అగ్ని ప్రమాదం..122 బైకులు దగ్ధం

    [వీడియో:](url) ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని ఓ షోరూంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 122 బైకులు కాలి బూడిదయ్యాయి. ఓ బైక్ షోరూం హార్డ్‌వేర్ దుకాణంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పాతవి, కొత్తవి కలిపి దాదాపు 122 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. #fireaccident #AndhraPradeshThere was a huge fire in … Read more

    మనవడి గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్‌

    TG: కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వేడుకలో హిమన్షు 12వ తరగతి పట్టా అందుకున్నారు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు లభించింది. గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన అనంతరం హిమాన్షు కేసీఆర్‌ వద్దకు వెళ్లారు. పట్టాను కేసీఆర్ చేతిలో పెట్టి పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ భార్య, కేటీఆర్‌ దంపతులు కూడా పాల్గొన్నారు. 12వ తరగతి విజయవంతంగా పూర్తి చేసిన వారికి … Read more

    తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి; పవన్

    [వీడియో: ](url)తెలంగాణ ప్రజలకు వైఎస్సార్‌సీపీ క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడటం దారుణమన్నారు. వారిని కించపరిచేలా మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. ఏపీలోని అధికార పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నేతల వైఖరి తనకు బాధ కలిగించిందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM — JanaSena Party (@JanaSenaParty) April 16, 2023

    లోకేశ్ కాళ్లకు బొబ్బలు; భోరున ఏడ్చిన టీడీపీ నేత

    [వీడియో:](url) టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేశ్ అరి కాలికి ఏర్పడిన బొబ్బలను తలుచుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. లోకేశ్ తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను చూసినట్లుగా ఇప్పుడు లోకేశ్‌ను చూడటానికి జనం వస్తున్నారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రపై కంటతడి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు… … Read more

    హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

    TS: నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 8 గంటల వరకు ఆయా రూట్లను మూసేస్తున్నారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ వైపు ఆంక్షలు ఉంటాయి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ రోడ్, లుంబినీ పార్క్, ప్రసాద్ ఐమ్యాక్స్ పూర్తిగా మూసేసే ఉంటాయి. ఆయా రూట్ల వైపు నుంచి వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం ట్రాఫిక్ పోలీసుల … Read more

    రేపే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

    [VIDEO](url): దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు ఆవిష్కరించనున్నారు. గద్దె, విగ్రహం కలిపి భూమి నుంచి 175 అడుగుల ఎత్తులో ఉందీ విగ్రహం. స్మారక భవనంలో అంబేడ్కర్ జీవిత విశేషాలతో ఆర్ట్ గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్స్, మ్యూజియం ఉండనున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్‌ని ఆనుకుని 11.80 ఎకరాల్లో ఈ స్మారకాన్ని నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పల్లెల్లోకి 750 బస్సులను పంపనున్నారు. 50వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బౌద్ధ గురువుల ప్రార్థనల నడుమ ఆవిష్కార … Read more

    బలగం నటుడికి తీవ్ర అనారోగ్యం

    బలగం సినిమా క్లైమాక్స్ సీన్‌లో తన గానంతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ తరలించాలని సూచించగా ఆయన భార్య సాయం కోసం ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే మొగిలయ్య రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం గుండె జబ్బు కూడా రావడంతో తమను ఆదుకోవాలని ఆయన కుటుంబం వేడుకుంటోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మెుగిలయ్య, కొమురమ్మ దంపతులు … Read more

    నా తడాఖా చూపిస్తా.. మీ అంతు చూస్తా: ఎమ్మెల్యే

    భారాసలో అంతర్గత పోరు బట్టబయలవుతుంది. హైదరాబాద్‌ అంబర్‌పేట‌్‌లో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. గోల్నాక డివిజన్‌లో మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి కార్పొరేటర్‌ లావణ్య నివాళులర్పించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కార్పొరేటర్ దంపతుల మధ్య వివాదం తలెత్తింది. నీ అంతుచూస్తానంటూ లావణ్యను ఎమ్మెల్యే బెదిరించారు. దీంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. కార్పొరేటర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. War of words between Amberpet MLA Kaleru Venkatesh and Golnaka Corporators Husband Srinivas … Read more

    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 

    సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా … Read more

    Hyderabad Rains: వడగండ్ల బీభత్సం… తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ!

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, సికింద్రాబాద్, నారాయణ గూడలో వాన కురిసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు పొలాల వద్ద చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, రామాంతపూర్‌, అంబర్‌పేట్‌, మలక్‌ … Read more