బలగం సినిమా క్లైమాక్స్ సీన్‌లో తన గానంతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ తరలించాలని సూచించగా ఆయన భార్య సాయం కోసం ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే మొగిలయ్య రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం గుండె జబ్బు కూడా రావడంతో తమను ఆదుకోవాలని ఆయన కుటుంబం వేడుకుంటోంది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మెుగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్రకథలు చెబుతుంటారు. వాళ్ల పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమైన వృత్తినే కొనసాగిస్తున్నారు.. బుర్ర కథలు చెబుతూ వచ్చే సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు. మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో బుర్రకథ చెబుతూ వచ్చే అరకొర డబ్బులతో జీవనాన్ని నెట్టుకొస్తుంది ఈ జంట. గతంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా పైకప్పు కూలిపోయింది. ప్రస్తుతం పరదా చాటున కాలం వెళ్లదీస్తున్నారు.
వీళ్లద్దరితో క్లైమాక్స్ చేయటానికి సంబంధించిన విషయాన్ని దర్శకుడు వేణు వివిధ ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. “ సినిమా కథ సిద్ధమైనప్పటికీ క్లైమాక్స్ ఎలా రాయాలని చాలా కష్టపడ్డాను. ఒక రోజు అనుకోకుండా బంధువులు చనిపోతే వాళ్లని పలకరించేందుకు వెళ్లాను. అక్కడ ఇలా పాడుతుండటం చూసి క్లైమాక్స్‌గా రాస్తే బాగుంటుందని అనిపించి దిల్ రాజు గారికి క్లైమాక్స్ చెప్పాను. వెంటనే ఓకే చేశారు. తర్వాత మెుగిలయ్య, కొమురమ్మలను తీసుకొచ్చి పాటను చిత్రీకరించాం” అన్నారు.
మెుగిలయ్య కుమారుడు ప్రస్తుతం స్టీల్ షాప్ నడుపుతున్నాడు. భార్యభర్తలిద్దరూ నిరక్షరాస్యులు అయినప్పటికీ సన్నివేశాన్ని బట్టి అప్పటికప్పుడు కథలు అల్లుతూ రక్తికట్టిస్తారు. బలగంలో అవకాశం వచ్చిన తర్వాత వీరికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కానీ, మెుగిలయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?