TG: కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వేడుకలో హిమన్షు 12వ తరగతి పట్టా అందుకున్నారు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు లభించింది. గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన అనంతరం హిమాన్షు కేసీఆర్ వద్దకు వెళ్లారు. పట్టాను కేసీఆర్ చేతిలో పెట్టి పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ భార్య, కేటీఆర్ దంపతులు కూడా పాల్గొన్నారు.
12వ తరగతి విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఓక్రిడ్జ్ స్కూల్ యాజమాన్యం పట్టాలు అందజేసింది. అంతేకాదు, విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు అందజేశారు. పట్టాతో పాటు అవార్డు తీసుకున్న హిమాన్షు గ్రాడ్యూయేషన్ వేడుకలు చూసేందుకు కుటుంబమే కదిలి వచ్చింది.
గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాన్షు వెంటనే స్టేజీ దిగి తాత వద్దకు వెళ్లారు. పట్టాను కేసీఆర్ చేతిలో పెట్టి పాదాభివందనం చేశారు. చిన్నతనం నుంచే తన వద్దే పెరిగిన మనుమడికి కేసీఆర్ ఆశీర్వాదం ఇచ్చారు. సామాజిక సేవలో గొప్ప ప్రతిభ కనబర్చి ఎక్సలెన్సీ అవార్డు పొందినందుకు అభినందించారు సీఎం. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దీవించారు.
హిమాన్షు తల్లిదండ్రులైన మంత్రి కేటీఆర్, శైలిమ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తన కుమారుడు చేస్తున్న పనుల పట్ల కేటీఆర్ ఎప్పుడూ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఇటీవల ఓ ఇంగ్లీష్ ఆల్బమ్‌ను ఆలపించి యూట్యూబ్‌లో పెట్టగా.. అప్పుడ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ కార్యక్రమానికి హిమాన్షు చెల్లెలితో పాటు అమ్మమ్మ, మేనమామలు సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!