సత్తా చాటిన కేసీఆర్ మనవడు
సీఎం కేసీఆర్ మనువడు హిమాన్షు మరోసారి నాయకత్వ ప్రతిభతో సత్తా చాటాడు.హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్లో సృజనాత్మక, సామాజిక దృక్పథం ఇతివృత్తంతో నిర్వహించిన కార్నివాల్‌కు ఇంఛార్జిగా హిమాన్షు వ్యవహరించాడు. ఈవెంట్లో 31మంది కళాత్మకతను ప్రదర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్నివాల్‌కు వచ్చిన డబ్బుతో చేయదలుచుకున్న మంచి పనులు హిమాన్షు చెప్పారు. ఇలా హిమాన్షు ఆలోచనలు చూస్తుంటే కేసీఆర్‌కి తగ్గ మనవడని పలువురు ప్రశంసిస్తున్నారు.