• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dhoomam OTT Review: సిగరేట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ధూమం’ ఎలా ఉందంటే?

    నటీనటులు : ఫహద్ ఫాజిల్‌, అపర్ణ బాలమురళి, రోషన్‌ మ్యాథ్యూ, వినీత్‌, అను మోహన్‌, అచ్యుత్‌ కుమార్‌, విజయ్‌ మీనన్‌ తదితరులు

    రచన, దర్శకత్వం : పవన్‌ కుమార్‌

    సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి

    సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్‌

    ఎడిటింగ్‌ : సురేష్‌ అరుముగన్‌

    నిర్మాతలు : విజయ్‌ కిరగందూర్‌, విజయ్‌ సుబ్రహ్మణియన్‌

    విలక్షణ నటుడిగా దక్షిణ చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు నటుడు ‘ఫహద్‌ ఫాజిల్‌’. హీరో, విలన్‌ అనే భేదాలు లేకుండా తన అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మలయాళంలో అతడు నటించిన ‘ధూమం’ (Dhoomam) చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తాజాగా ఈ సినిమాను తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహా వేదికగా జులై 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఫహద్‌ ఫాజిల్‌ మరోమారు తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడా? అసలు ‘ధూమం’ కాన్సెప్ట్ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    అవినాష్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) ఓ సిగరేట్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు. సేల్స్‌ హెడ్‌గా తన తెలివితేటలతో అమ్మకాలను అమాంతం పెంచేస్తాడు. కంపెనీ ఎండీ సిధ్‌ (రోషన్‌ మ్యాథ్యు)తో ఓ రోజు అవినాష్‌కు గొడవ జరుగుతుంది. దీంతో జాబ్‌కి రిజైన్‌ చేస్తాడు. ఒక రోజు భార్య దియా (అపర్ణ బాలమురళి)తో కలిసి కారులో వెళ్తుండగా అతడిపై ఓ ముసుగు వ్యక్తి అటాక్‌ చేస్తాడు. భార్యను ఎత్తుకెళ్లి తను చెప్పింది చేస్తే విడిచిపెడతానని వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతకీ ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అవినాష్‌ ఓ మర్డర్‌ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? ముసుగు వ్యక్తికి కంపెనీ ఎండీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ట్రాప్‌ నుండి అవినాష్‌ ఎలా బయటపడ్డాడు? అన్నది స్టోరీ.

    ఎవరెలా చేశారంటే

    ‘ధూమం’ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ వన్‌మ్యాన్‌ షో చేశాడు. అవినాష్‌ పాత్రలో పూర్తిగా జీవించేశాడు. భార్యను కాపాడుకునే భర్తగా, తప్పును సరిద్దుకునే వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ఇక దియా పాత్రలో అపర్ణ బాలమురళి ఆకట్టుకుంది. సహజమైన నటనతో మెప్పించింది. అటు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రోషన్‌ మ్యాథ్యూ కనిపించాడు. అతడితో పాటు ప్రవీణ్‌గా చేసిన వినీత్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చక్కటి నటన కనబరిచాడు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    సిగరేటు, పొగాకు ఉత్పుత్తుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం ఏంటో డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. లాభాల కోసం సిగరేట్‌ కంపెనీలు వేసే ఎత్తులను కళ్లకు కట్టాడు. ఓ ట్రాప్‌లో ఇరుక్కున్న యువకుడు తన భార్యను కాపాడునేందుకు చేసిన పోరాటాన్ని థ్లిల్లింగ్‌గా చూపించాడు. హీరో హీరోయిన్ల ప్రజెంట్‌, పాస్ట్‌ను సమాంతరంగా నడిపిస్తూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విరామ సమయానికి ఇచ్చిన ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన క్లైమాక్స్‌తో ముగించిన తీరు మెప్పిస్తుంది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడం, తక్కువ పాత్రలే ఉండటం, సెకండాఫ్‌ మరి నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌గా మారింది.

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే పూర్ణచంద్ర తేజస్వి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఎడిటర్‌ పనితీరు ఓకే. సెకండాఫ్‌ను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • ఫహద్‌ ఫాజిల్‌ నటన
    • సందేశం
    • విభిన్నమైన క్లైమాక్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • నెమ్మదిగా సాగే కథనం
    • సెకండాఫ్‌

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv