• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Fastest 500Cr Movies: జెట్‌ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?

    ఒకప్పుడు దేశంలో సూపర్‌ హిట్‌ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్‌ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్‌ బాస్టర్‌గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్‌ 10 భారతీయ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

    1. బాహుబలి-2

    ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.

    2. ఆర్‌ఆర్‌ఆర్‌

    బాహుబలి-2 తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘RRR’ నిలిచింది. ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లోనే రూ.570 కోట్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం తెలిసిందే.

    3. కేజీఎఫ్‌ 2

    యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్‌-2’ చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. RRRతో పోలిస్తే రూ.10 కోట్లు తక్కువ రావడంతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.

    4. పఠాన్‌

    బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ మూవీ ‘పఠాన్‌’ సైతం అత్యంత వేగంగా రూ.500 కోట్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.545 కోట్లు వసూలు చేసింది. 

    5. రోబో 2.0

    రజనీకాంత్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో 2.0’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టడం విశేషం.

    6. సుల్తాన్‌

    సల్మాన్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘సుల్తాన్‌’ చిత్రం కూడా డివైడ్‌ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. 

    7. దంగల్‌ 

    బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘దంగల్‌’ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా రూ.1,968-2,200 కోట్లను రాబట్టింది. 

    8. పీకే 

    అమీర్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘పీకే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ మూవీ సైతం 14 రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టడం జరిగింది.

    9. టైగర్‌ జిందా హై

    బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రం 15 రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టింది. 

    10. సంజు

    బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా చేశాడు. ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లో రూ.586 కోట్ల వసూళ్లను రాబట్టింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv