• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New OTT Releases Telugu: ఈవారం ఓటీటీలో ఏకంగా 24 చిత్రాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్‌!

    ‘కల్కి 2898 ఏడీ’ ప్రభావం.. ఈ వారం కూడా కొత్త సినిమాల విడుదలపై పడింది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుండటంతో తమ చిత్రాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో ఈ వారం థియేటర్‌లో ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం జూలై 1 నుంచి 7 మధ్య సినిమాలు సిరీస్‌లు కలిపి 24 వరకూ స్ట్రీమింగ్‌లోకి రాబోతున్నాయి. అయితే ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం కాస్త నిరాశ పరుస్తోంది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్న ముఖ్యమైన చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు

    అహం రీబూట్‌

    ప్రముఖ నటుడు సుమంత్‌ (Sumanth) హీరోగా సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘అహం రీబూట్’ (Aham Reboot) చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లను స్కిప్‌ చేస్తూ జూన్‌ 30న ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఎంతో ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఒకే క్యారెక్టర్‌తో ఒకే రూమ్‌లో ఓ రేడియో షో బ్యాగ్‌డ్రాప్‌తో ‘అహం రీబూట్‌’ కథ సాగుతుంది. 

    శశి మథనం

    రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా రూపొందిన తెలుగు వెబ్‌సిరీస్‌ శశి మథనం (Shashi Madhanam Web Series).. ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్‌ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్‌ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘శశిమథనం’ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    మీర్జాపూర్‌ సీజన్‌ 3

    అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్‌ సిరీస్‌కు ఎంత పెద్ద క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని నుంచి వచ్చిన రెండు సిరీస్‌లు హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఈ వారం ‘మీర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3) రాబోతోంది. అమెజాన్‌ వేదికగా జులై 5 నుంచి ఈ సిరీస్‌ హిందీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్‌లో ఉండనుంది. సీజన్‌ 2 ముగింపులో మున్నా (దివ్యేంద్రు శర్మ).. గుడ్డు (అలీ ఫజల్‌) చేతిలో చనిపోయిన తర్వాత మీర్జాపూర్‌ సింహాసనం గుడ్డు కాళ్ల దగ్గరకు వస్తుంది. ఖాలీన్‌ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) చేతిలోని మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసించాడు? గుడ్డును చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవడానిలి లోకల్‌ గ్యాంగ్స్ ఏం చేశాయి? వారిపై గుడ్డు ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది సీజన్‌ 3లో చూపించనున్నారు. 

    TitleCategoryLanguagePlatformRelease Date
    Star Trek Prodigi S2SeriesEnglishNetflixJuly 1
    Alwin S5SeriesEnglishNetflixJuly 1
    Sprint SeriesEnglishNetflixJuly 2
    Bevarly Hills CopMovieEnglishNetflixJuly 2
    The Man With 1000 KidsSeriesEnglishNetflixJuly 3
    Barbecue Showdown S 3SeriesEnglishNetflixJuly 4
    Rime Plus Flow France S3SeriesFrench/EnglishNetflixJuly 4
    GoyoMovieSpanish/EnglishNetflixJuly 5
    Red SwanSeriesKorean/EnglishHotstarJuly 3
    Land of TanabataSeriesJapanese/EnglishAhaJuly 4
    Prime Time With Murthi’sSeriesHindiJio CinemaJuly 3
    He Went That WayMovieEnglishJio CinemaJuly 5
    HaraMovieTamilAhaJuly 5
    IfMovieEnglishBook My ShowJuly 3
    Furiosa: A Mad Max SagaMovieEnglishBook My ShowJuly 4
    Malayali From IndiaMovieMalayalamSonyLIVJuly 5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv