• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Aham Reboot OTT Review: సినిమా మెుత్తం సుమంత్ పాత్ర ఒక్కటే.. ‘అహం రీబూట్‌’ ప్రయోగం ఫలించిందా?

    నటీనటులు :  సుమంత్‌

    రచన, దర్శకత్వం : ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి

    సంగీతం : శ్రీరామ్‌ మద్దూరి

    సినిమాటోగ్రఫీ : వరుణ్‌ అంకర్ల

    ఎడిటింగ్‌ : మురళి కృష్ణ మన్యం

    విజువల్‌ ఎఫెక్ట్స్‌ : శశ్వత్‌ కౌరవ్‌

    నిర్మాతలు : రఘువీర్‌, సృజన్‌ 

    ఓటీటీ వేదిక : ఆహా (Aha OTT)

    సుమంత్‌ హీరోగా ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి రూపొందించిన చిత్రం ‘అహం రీబూట్‌’ (Aham Reboot ott). రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీని తొలుత థియేటర్‌లో రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల జూన్‌ 30న సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? సుమంత్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ కావాలని కలలు కన్న నిలయ్‌ (సుమంత్‌).. ఓ యాక్సిడెంట్‌ వల్ల రేడియో జాకీగా మారతాడు. స్టూడియోలో ఉండగా ఓ రోజు నిలయ్‌కు.. ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అయి లైవ్‌ పెడతాడు. రేడియోలో వీరి మాటలు విన్న పోలీసులు.. ఆమె కిడ్నాప్‌ అయ్యిందని నమ్మి కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కిడ్నాపైన యువతి వివరాలు సేకరించే బాధ్యతను స్టూడియోలో ఉన్న నిలయ్‌కు అప్పగిస్తారు. ఇంతకీ ఆ యువతి ఎవరు? నిజంగానే ఆమెను కిడ్నాప్‌ చేశారా? పోలీసులు ఆమెను ఎలా కాపాడారు? నిలయ్‌ వల్ల యాక్సిడెంట్‌లో చనిపోయిన యువతి ఎవరు? ఆమెకు కిడ్నాప్‌ అయిన అమ్మాయికి ఏమైన సంబంధం ఉందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    అహం రీబూట్ సినిమాలో (Aham Reboot Movie Review).. సుమంత్‌ వన్‌ మ్యాన్‌ షో చేశారు. సినిమా మెుత్తం ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మిగతా పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. సినిమా మెుత్తం తనపైనే డిపెండ్ అయిన వేళ.. సమంత్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. మ‌న‌సులో అంతులేని బాధ‌ను మోసే ఓ మోడ్ర‌న్ యువ‌కుడిగా, ఓ అమ్మాయి ప్రాణాల‌ను కాపాడేందుకు ఆరాట‌ప‌డే ఆర్జేగా అత‌డి యాక్టింగ్ బాగుంది. ఏమోషన్స్‌ను చక్కగా పండించాడు. కథను తన భుజాలపై మోసుకుంటూ నడిపించాడు. లుక్‌ పరంగా సుమంత్‌ ఈ మూవీలో కొత్తగా కనిపించారు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    సింగిల్ క్యారెక్ట‌ర్ మూవీ చేయ‌డం అన్న‌ది క‌త్తిమీద సాము లాంటిది (Aham Reboot Movie Review). అందులోనూ ఒకే చోట నుంచి క‌థ‌ను ర‌క్తి క‌ట్టించ‌డం అంటే అంత ఈజీ కాదు. ఈ ప్ర‌య‌త్నంలో దర్శకుడు ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి కొంత మేర సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కిడ్నాప్‌కు గురైన అమ్మాయి ఫోన్‌ కాల్‌తో అసలు కథను మెుదలవుతుంది. కిడ్నాప్‌ అయిన అమ్మాయి నుంచి హీరో వివరాలు రాబట్టడం, వాటిని పోలీసులకు అందించడం, పోలీసులు ఆమెను కాపాడేందుకు యత్నించడం చుట్టూ దర్శకుడు కథను తిప్పారు. ఈ క్రమంలో స్టోరీని బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఆఖర్లో నిలయ్‌ జీవితానికి, కిడ్నాప్‌ అయిన యువతికి లింక్‌ చేస్తూ ఇచ్చిన ట్విస్ట్‌ బాగుంది. అయితే సినిమా మెుత్తం సుమంత్ మాత్రమే క‌నిపించ‌డం, కేవ‌లం డైలాగ్స్ ద్వారానే క‌థ‌ను చెప్ప‌డం వ‌ల్ల బోర్‌ కొట్టించిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఓపికగా చూడకలిగితే.. అహాం రీబూట్‌ ఒక మంచి థ్లిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. 

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యింది. శ్రీరామ్‌ మద్దూరి ఇచ్చిన BGM ఆసక్తికర సన్నివేశాలను మరింతగా ఎలివేట్‌ చేసింది. ఒకే పాత్ర ఉండటంతో ఎడిటింగ్‌ క్రిస్పిగా చేయడం కలిసొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • సుమంత్‌ నటన
    • ప్రయోగాత్మకంగా కథ చెప్పడం
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్‌

    • మూవీ మెుత్తం ఒక పాత్రే ఉండటం

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv