• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్‌ సక్సెస్‌ చేసిన డైలాగ్స్‌ ఇవే..!

  ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్‌ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడని, ఇండియన్‌ సినిమా స్టాండర్డ్స్‌ను కల్కి టీమ్‌ గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. మరి ముఖ్యంగా కల్కిలో ప్రభాస్‌ డైలాగ్స్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ డైలాగ్స్‌ కల్కిలో పడ్డాయని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ సహా కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె ఇతర ప్రధాన తారాగణం చెప్పిన డైలాగ్స్‌ను కూడా ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ప్రేక్షకులను మిస్మరైజ్‌ చేసిన కల్కి డైలాగ్స్ ఏవి? అవి ఏ సందర్భంలో వచ్చాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

  కల్కి మూవీ డైలాగ్స్‌

  కల్కి సినిమా ప్రారంభంలో కురుక్షేత్రం ఎపిసోడ్‌ చూపిస్తారు. గర్భస్త శిశువుపై అస్త్రాన్ని వదిలి.. అశ్వత్థామ పెద్ద తప్పు చేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు అతడ్ని శపించే క్రమంలో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. 

  అశ్వత్థామ : చంపడానికి వస్తే నన్ను చంపు కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి నేను అర్జునుడ్ని కాదు. 

  కృష్ణుడు : ఈ 18 రోజులు కురు క్షేత్రంలో జరిగిన పాపాల కన్నా.. నీ అధర్మం నిష్కృతమైనది. ధ్రోణాచార్యుడి పుత్రుడివి అయ్యుండి ఇంతకు దిగజారావా?

  అశ్వత్థామ : నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు. నువ్వు అనుకుంటే అతడి మరణాన్ని ఆపగలిగేవాడివి.

  కృష్ణుడు : అశ్వత్థామ.. దేవుడైనా క్రురుడైనా కర్మను తప్పించుకోలేరు. గర్భస్త శిశువుపై అస్త్రం వదిలావు. నీ ఖర్మ నువ్వు అనుభవించక తప్పదు. 

  అశ్వత్థామ : అయితే సంధించు చక్రం.. విధించు నీ శిక్షని.

  కృష్ణుడు : చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ.. అది విముక్తి. కాలాంతరం పాండవులు అందరూ చనిపోతారు. నా శరీరమూ మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ, నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక.. చావు రాక.. బ్రతకలేక.. ఎన్నో పాపాలు చూస్తూ జీవిస్తావు. ఇదే నా శాపం.

  అశ్వత్థామ : మరి నా శాపానికి ప్రాయిశ్చిత్తం లేదా?

  కృష్ణుడు : నువ్వు నన్ను చంపాలనుకున్నావ్‌.. కానీ ఒక రోజు నువ్వే నన్ను కాపాడాలి. 

  అశ్వత్థామ : నేనా?

  కృష్ణుడు : కలియుగం వస్తుంది. కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటి అయినప్పుడు నేను మళ్లీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి మహా శక్తిశాలి. ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భ గుడికి కాపలా కాయాలి.

  డైలాగ్‌

  కాంప్లెక్స్‌ ఒక యువకుడిపై 5000 యూనిట్స్‌ నజరానా ప్రకటిస్తుంది. అతడ్ని పట్టుకునేందుకు ఓ గ్యాంగ్ వెళ్తుంది. ఈ సందర్భంలో పారిపోతున్న ఆ వ్యక్తికి బుజ్జి (AI వెహికల్‌).. సంకెళ్లు వేస్తుంది. అప్పుడు బుజ్జిపై విలన్‌ గ్యాంగ్‌ కాల్పులు జరుపుతారు. దీంతో బుజ్జి తన బాస్‌ భైరవ (ప్రభాస్‌)ను పరిచయం చేస్తూ బైరవకు ఎలివేషన్స్ ఇస్తుంది.

  బుజ్జి : హేయ్‌.. స్టాప్‌. నన్ను షూట్‌ చేస్తావా. ఇప్పుడు చూడు నా బాస్‌ వచ్చి మీ అందరిని స్మాష్‌ చేస్తాడు.

  విలన్‌ గ్యాంగ్‌: ఎవరు మీ బాస్‌?

  బుజ్జి : పాత యుద్ధాల్లో సోల్జర్‌. ఇంత వరకూ  ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ది వన్‌ అండ్‌ ఓన్లీ భైరవ (ఈ డైలాగ్‌ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు)

  భైరవ: ఎంట్రీ అనంతరం భైరవ నేలపై గురక పెట్టి నిద్ర పోతాడు..

  బుజ్జి : భైరవ గెటప్‌.. చాలా బిల్డప్‌ ఇచ్చాను లే.

  భైరవ: బుజ్జి.. బుజ్జి.. ప్లీజ్‌ 5 మినిట్స్‌ పడుకుంటాను. (దీని తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌ ఉంటుంది)

  డైలాగ్‌

  సుప్రీమ్‌ యాస్కిన్‌ (కమల్‌ హాసన్‌).. కాంప్లెక్స్‌లో తన మనుషుల చేత గర్భిణి స్త్రీలపై ప్రయోగాలు చేయిస్తుంటాడు. దీంతో యాస్కిన్‌ బృందంలోని ఒక సైంటిస్టు అతడ్ని చంపడానికి యత్నిస్తాడు. యస్కిన్‌.. ఆ సెంటిస్టును చంపుతూ చెప్పే డైలాగ్స్‌ మెప్పిస్తాయి. 

  సుప్రీమ్‌ యాస్కిన్‌: చావుకు నేను చాలా ప్రాణాలు ఇచ్చాను. అది నన్నేం చేయదు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు నన్ను చంపాలనుకున్నావ్‌?

  సైంటిస్టు : మంచి కోసం.. 

  సుప్రీమ్‌ యాస్కిన్‌ : మంచి.. చరిత్రలో ఎన్ని ప్రాణాలు తీసిందో తెలుసా ఈ మంచి. రాజులు రాజ్యాలు మారుతున్న ప్రతీసారి మారుతుందీ మంచి. దాన్ని నమ్మోద్దు. ఇంతకీ నీకేం కావాలి?

  సైంటిస్టు : ఈ లోకాన్ని కాపాడాలి

  సుప్రీమ్ యాస్కిన్‌ : అదే కదా.. నేనూ చేసింది. దేవుడిని, డబ్బులని, వందల యుద్ధాలు చేసే అందరినీ ఒక్క యుద్ధంతో గెలిచాను తప్పా?. మీరు బూడిద చేస్తున్న ప్రకృతిని అందనంత దూరంలో పెట్టాను.. తప్పా?

  సైంటిస్టు : నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వు ఎవరు?

  సుప్రీమ్‌ యాస్కిన్‌ : మరి నాశనం చేయడానికి మీరు ఎవరు? ఎన్ని యుగాలు అయినా.. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు.. మారలేడు. ఇది నీ తప్పు కాదులే. హ్యూమన్‌ బీయింగ్స్‌కు ఉన్న డిఫెక్టే అది. 

  డైలాగ్‌

  కల్కిని గర్భంలో మోస్తున్న సుమతి (దీపిక పదుకొణె)ని.. సుప్రీమ్‌ యస్కిన్‌ మనుషుల నుంచి కాపాడి అశ్వత్థామ శంబాలకు తీసుకు వస్తాడు. అప్పుడు శంబాలకు రక్షణాధికారిగా ఉన్న వ్యక్తి సుమతి ఎవరో తెలియక అడ్డుకుంటాడు. సందర్భంలో వచ్చే సీన్‌, డైలాగ్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి.

  రక్షణాధికారి : ఆమెను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావు. 5 మిలియన్ పౌండ్లు పెట్టారు ఈమె మీద. కాంప్లెక్స్‌ మాత్రమే కాదు వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు ఆమె కోసం వెతుకున్నారు. ఎలా కాపాడతావు?

  అశ్వత్థామ : నేను కాపాడతాను

  రక్షణాధికారి : అసలు నువ్వు ఎవరు? పొడుగ్గా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా యుద్ధం చేశావా?

  అశ్వత్థామ గురించి తెలిసిన బాలుడు: ఎక్స్‌క్యూజ్‌మీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు.. ఓకే. (ఇక్కడ హైలెట్‌ బీజీఎం వస్తుంది)

  రక్షణాధికారి : అందరికీ పిచ్చి ఎక్కిందా? ఈమె (సుమతి) ఇక్కడి రావడం వల్ల అందరికీ ఎంతో డేంజరో అర్థమవుతుందా? తను జస్ట్‌.. ల్యాబ్‌ నుంచి ఎస్కేప్‌ అయిన మామూలు ప్రెగ్నెంట్‌ ఉమెన్‌. ఏమీ స్పెషల్‌ ఉమెన్‌ కాదు. అయినా పుట్టేది దేవుడు అనడానికి ఏంటీ సాక్ష్యం.

  *ఆ డైలాగ్‌ అనగానే వెంటనే వర్షం మెుదలవుతుంది. అక్కడ వాన పడి చాలా కాలమే అయి ఉంటుంది. ఆమె రాకతో వర్షం పడటంతో కల్కి జన్మించేది ఆమె కడుపునే అని శంబాలా ప్రజలు నమ్ముతారు. ఈ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది.

  డైలాగ్‌

  మహావిష్ణువు.. కల్కిగా పుట్టేందుకు తననే ఎందుకు ఎంచుకున్నాడని సుమతి (దీపిక).. అశ్వత్థామను ప్రశ్నిస్తుంది. ఆ సందర్భంలో వచ్చే డైలాగ్స్‌ మిస్మరైజింగ్‌ చేస్తాయి. 

  అశ్వత్థామ : నువ్వు ప్రాణం ఇవ్వడానికే పుట్టావ్‌ అమ్మా?

  సుమతి : అసలు ఏం మాట్లాడుతున్నారు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి?

  అశ్వత్థామ : ప్రతీ చావుకి ఒక పరమార్థం ఉంటుంది. ప్రతీ చావు లోకానికి కొత్త ఊపిరి పోస్తుందమ్మా.

  సుమతి : కానీ, నేనే ఎందుకు?

  అశ్వత్థామ : మోయగలిగిన శక్తి ఉన్నవారికే బాధ్యతను ఇస్తాడు ఆ దేవుడు. భగవంతుడ్ని కడుపులో మోయాలంటే భూదేవి అంత ఓర్పు ఉండాలి. మీలో ఆ ఓర్పు ఉందనే మిమ్మల్ని తల్లిగా ఎంచుకున్నారు. 

  అశ్వత్థామ: నువ్వు ఇప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మ.. సృష్టిని. జన్మనివ్వడం నీ ధర్మం కాపాడటం నా బాధ్యత.

  డైలాగ్‌

  శంబలకు తీసుకెళ్లిన సుమతి తనకు కావాలని కాంప్లెక్స్‌ ప్రతినిధి చటర్జీ తన మనుషులతో అంటాడు. అన్ని డైరెక్షన్స్‌లో రైడర్స్‌ పంపాం.. త్వరలోనే పట్టుకుంటామని అతని కమాండర్ చెబుతాడు. అప్పటికే అశ్వత్థామతో యుద్ధం చేసిన ప్రభాస్‌.. ఏమి చేయలేరని అంటాడు. ఈ సందర్బంలో ఛటర్జీతో అతడి సంభాషణ ఆకట్టుకుంటుంది.

  భైరవ : ఆ ముసలోడు ఉన్నంతవరకూ ఏం చేయలేరు.

  ఛటర్జీ : ముసలోడా?

  భైరవ : మీ వాళ్లందరినీ కొట్టింది అతడే? ఒక్కడు కూడా వాడ్ని టచ్‌ చేయలేదు. నేను తప్పా.

  ఛటర్జీ : వీడెవడు అసలు?

  కమాండర్‌: భైరవ అని బౌంటీ ఎంటర్‌ సర్‌. మన వాళ్లని కొడితే బ్లాక్‌ లిస్ట్‌ చేశాను. 

  భైరవ: ఎలాగైనా బ్లాక్‌ లిస్ట్‌ చేశావు కదా. మళ్లీ కొడతా. పాయింట్‌ ఏంటి అంటే నేను ఒక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను. మీకు వేరే ఆప్షన్‌ లేదు. 

  ఛటర్జీ : అంత ష్యూర్‌ ఆ.. 

  భైరవ : రికార్డ్స్‌ చూసుకో.. ఇంతవరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. 

  డైలాగ్‌

  కల్కి క్లైమాక్స్‌లో.. కమల్‌ హాసన్‌ మీద వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. శక్తిని పుంజుకున్న తర్వాత ఆయన చెప్పే ‘జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌.. రథచక్ర ప్రళయఘోళ భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను’.. అనే డైలాగ్‌ సెకండ్‌ పార్ట్‌లో తాను ఎంత విధ్వంసం సృష్టిస్తానో తెలియజేస్తుంది. అయితే ఈ డైలాగ్‌ శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనిది. 44 ఏళ్ల క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఇదే డైలాగ్‌ను కమల్‌ హాసన్ చెప్తారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అతడి నోట శ్రీశ్రీ కవిత వినిపించడం ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. 

  డైలాగ్‌

  కల్కిలో అప్పటివరకూ భైరవగా ఉన్న ప్రభాస్‌.. చివరి భాగంలో కర్ణుడిగా కనిపించి అందరికీ షాకిస్తాడు. చివరి పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్‌లో కర్ణుడిగా కనిపించి స్క్రీన‌ను షేక్‌ చేస్తాడు.  ‘ఆలస్యమైందా ఆచార్య పుత్ర’ అంటూ ప్రభాస్‌ విల్లు పట్టుకుని రథంపై నిలబడగా.. థియేటర్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. భైరవను కర్ణుడిగా పరిచయం చేసే సందర్భంలో వచ్చే కురుక్షేత్రంలోని డైలాగ్స్‌ విజిల్స్‌ వేయిస్తాయి. 

  అర్జునుడు : అశ్వత్థామ.. తలరాతను రాసే బ్రహ్మ చేసిన గాంఢీవం ఇది. దీనిని ఎవరు అడ్డుకోలేరు.

  కర్ణుడు: ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చి అర్జునుడు వేసిన బాణాన్ని నిలువరిస్తాడు. ఆ సందర్భంలో ఆలస్యమైందా ఆచార్య దేవా? అని అశ్వత్థామతో అంటాడు.

  అశ్వత్థామ: లేదు.. సరైన సమయంలోనే వచ్చావు. 

  అర్జునుడు: చూశావా.. కేశవ (కృష్ణుడు). తను నాకు సమానుడా? వాడ్ని (కర్ణుడు) అడ్డుకొని మన రథం కేవలం రెండు అడుగులు వెనక్కి వెళ్లింది. నా అస్త్రానికి అతడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లింది. 

  కృష్ణుడు : ఓ ధనుంజయ.. నీ రథం అగ్నిదేవుడి వరం. కాపాడుతున్నదని జెండాపై కపిరాజు (హనుమంతుడు).  నడుపుతున్నది ముల్లోకాలు నడిపించే నేను. అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జునా. 

  కృష్ణుడు: తను (కర్ణుడు) సామాన్య యోధుడు కాదు. తన కళ్లల్లోని తేజస్సు.. తన చేతిలోని ధనస్సు.. తన పేరు.. చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సూర్య పుత్ర వైకర్ణ.. కర్ణ. (ఈ డైలాగ్‌తో కల్కి తొలిపార్ట్‌ ముగుస్తుంది).

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv