మెగా తనయుడు రామ్ చరణ్ (Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ‘RRR’ వంటి గ్లోబల్ స్థాయి హిట్ తర్వాత చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్‌తో తలపడేందుకు నాగార్జున తనయుడు నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
సంక్రాంతి రేసులోకి ‘తండేల్’!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ను సంక్రాంతికి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. తొలుత డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే పెండింగ్ పనులు అప్పటిలోగా పూర్తయ్యే ఛాన్స్ కనిపించడలేదని సమాచారం. దీంతో 2025 సంక్రాంతికి తమ సినిమాను తీసుకొస్తే బాగుంటుందని తండేల్ టీమ్ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
చరణ్ వర్సెస్ చైతూ
టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్ ఛేంజర్ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్ కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే లవ్ స్టోరీతో నాగచైతన్య, సాయి పల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. తండేల్‌లోనూ ఇదే జంట రిపీట్ కావడంతో ఫలితం సానుకూలంగా ఉంటుందని చైతూ భావిస్తున్నాడు. చరణ్ వర్సెస్ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బాలయ్య నుంచి గట్టిపోటీ!
గేమ్ ఛేంజర్, తండేల్‌తో పాటు సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ సైతం ఉన్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK 109’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గత రెండు సంక్రాంతి పండగలకు బాలయ్య తన చిత్రాలను రిలీజ్ చేసి హిట్ కొట్టారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’, ‘తండేల్’ చిత్రాలకు బాలయ్య మూవీ నుంచి గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెంకటేష్ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూడా సంక్రాంతికి రిలీజయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు సందీప్ కిషన్ ‘మజాక’ కూడా పండగకే రానుంది. దీంతో ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్