• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Great Indian Festival Finale Days: అమెజాన్‌లో దీపావళి బొనాంజా.. బడ్జెట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

    ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. గత కొన్నిరోజులుగా నిర్వహిస్తున్న‘గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌’ (Great Indian Festival) సేల్‌కు భారీగా స్పందన వస్తోంది. రికార్డు స్థాయిలో ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు సేల్ అయినట్లు అమెజాన్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కొత్తగా ‘గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ ఫినాలే డేస్’ (Great Indian Festival Finale Days) పేరుతో అమెజాన్‌ మరిన్ని ఆఫర్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. దీపావళికి ముందు కొత్త ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. తక్కువ ధరకే మీకు నచ్చిన ఫోన్‌ను దక్కించుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న మెుబైల్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Samsung Galaxy M04 

    ఈ శాంసంగ్‌ మెుబైల్‌.. అమెజాన్‌ సేల్‌లో భాగంగా 46% డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. Galaxy M04 మెుబైల్ అసలు ధర రూ. 11,999. కానీ అమెజాన్‌ ఫినాలే డేస్‌లో భాగంగా రూ.6,528కే దీనిని విక్రయిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో శాంసంగ్ ఫోన్‌ కోరుకునే వారు ఈ ఆఫర్‌ను పరిశీలించవచ్చు. 

    Redmi 12C

    రెడ్‌మీ 12 సీ మెుబైల్‌లో ఈ అమెజాన్‌ సేల్‌లో భారీ రాయితీతో లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా 51% డిస్కౌంట్‌ లభిస్తోంది. ఫలితంగా రూ.13,999 విలువ గల ఈ ఫోన్‌.. రూ.6,799 అందుబాటులోకి వచ్చింది. 

    realme narzo N53

    రియల్‌మీ నార్జో ఎన్‌ 53 మెుబైల్‌ కూడా 27% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.10,999. కానీ అమెజాన్‌ దీనిని రూ.7,999లకు ఆఫర్ చేస్తోంది. లో బడ్జెట్‌లో రియల్‌మీ ఫోన్‌ కోసం వెతుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు.

    OPPO A18 

    ఈ ఒప్పో ఫోన్‌ కూడా అమెజాన్‌ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. 27% డిస్కౌంట్‌తో రూ.10,900 అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా రూ.1,090 బ్యాంక్‌ ఆఫర్లు, No COst EMI వెసులుబాటు ఉన్నాయి. ఈ మెుబైల్ ఎఫెక్టివ్‌ ప్రైస్‌ను రూ.8,999గా అమెజాన్ పేర్కొంది.

    Vivo Y02t

    రూ.15,999 అసలు ధర కలిగిన ఈ ఫోన్‌ను అమెజాన్ రూ. 8,999 అందిస్తోంది. 44% రాయితీతో వినియోగదారులకు విక్రయిస్తోంది. తక్కువ రేటులో వివో ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. 

    itel P40+

    తక్కువ రేంజ్‌లో పవర్‌పుల్‌ బ్యాటరీ ఫోన్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌. ఇది ఏకంగా 7000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 9,654. అమెజాన్‌ దీనిని 17 శాతం డిస్కౌంట్‌తో రూ.7,999 అందిస్తోంది. దీనికి అదనంగా రూ.1,199 విలువైన బడ్స్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్‌ రూ. 6,839.

    iQOO Z7s 5G

    ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ 33% అందిస్తోంది. దీంతో రూ.23,999 ఉన్న ఈ ఫోన్‌.. రూ.15,999కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా రూ.1,500 బ్యాంక్‌ కార్డు ఆఫర్లు ఉన్నాయి. ఈ మెుబైల్ ఎఫెక్టివ్‌ ప్రైస్‌ రూ.14,999.

    OnePlus Nord CE 3 5G 

    ఈ వన్‌ప్లస్‌ మెుబైల్‌పై అమెజాన్‌ భారీ రాయితీలు ప్రకటించింది. దీని అసలు ధర రూ.28,999 కాగా, అమెజాన్‌ రూ.24,499కే స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. ఆఫర్లలో భాగంగా రూ.2,500 విలువ గల కూపన్స్‌, బ్యాంక్‌ కార్డ్స్‌పై రూ.1,250 వరకూ తగ్గింపు, NO Cost EMI సౌకర్యాన్ని పొందవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv