హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజురోజుకి పెరుగుతోంది. వ్యాపార అవకాశాలు, నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండటంతో ఎక్కువమంది మహానగరాన్ని ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది. నగరంలో చాలామంది మిలియనీర్లు ఉన్న కారణంగా 65వ స్థానంలో నిలిచింది.
సంపన్న నగరం
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్కు అవకాశం దక్కింది. హెండ్లీ అండ్ పార్టనర్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 65వ స్థానంలో నిలిచింది భాగ్యనగరం. నగరంలో మెుత్తం 11,100 మిలియనీర్లు ఉన్నారు. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్లో అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగిందని నివేదికలో వెల్లడయ్యింది. ఈ లెక్కన రోజురోజుకి సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మహానగరంలో ఉన్న అవకాశాలు ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాప్లో ఎవరంటే?
అమెరికాలోని న్యూయార్క్ సిటీ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి అక్కడ 3,40,000 మంది మిలీయనీర్లు ఉన్నారు. జపాన్ రాజధాని టోక్యో 2,90,000 మంది మిలియనీర్లతో రెండో ప్లేస్లో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో 2,85,000, లండన్ 2,58,000, సింగపూర్ 2,40,100, లాస్ ఏంజెల్స్ 2,05,400 మంది సంపన్నులతో తర్వాతి వరుస స్థానాల్లో నిలిచాయి.
భారత్లోని రాష్ట్రాలు
భారత్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఈ జాబితాలో చోటు దక్కింది. 59,400 మిలియనీర్లతో ముంబయి 21వ స్థానం సంపాదించింది. దిల్లీ 30,200 మందితో 36వ స్థానంలో ఉండగా… 12,600 మంది సంపన్నులతో బెంగళూరు 60వ ప్లేస్లో నిలిచింది. కోల్కతా 12,100 మంది మిలియనీర్లతో 63వ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత 65వ ప్లేస్లో నిలిచింది హైదరాబాద్.
ఎలా నిర్ణయించారు
ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, సీఐఎస్, తూర్పు ఆసియా, ఐరోపా, ఆగ్నేయాసియా ఇలా వివిధ ప్రాంతాలుగా విభజించి హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంపన్న నగరాల జాబితాను రూపొందించింది. ఇందులో అమెరికా నుంచి అత్యధిక నగరాలు చోటు దక్కించుకున్నాయి. 2000 సంవత్సరంలో తొలిస్థానంలో ఉన్న లండన్ ఇప్పుడు నాలుగో ప్లేస్కు పడిపోవడం గమనార్హం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!