• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఢిల్లీకి వెళ్లిన లోకేష్

  టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో కేసులపై చర్చించనున్నారు. కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తారు. చంద్రబాబు క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.. మరోపైపు ఏపీ ప్రభుత్వం లోకేష్‌పై పలు కేసులు మోపుతోంది. .

  ఒకే ఇంట్లో ఏడుగురి మృతి

  గుజరాత్‌ దారుణ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతిచెంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆర్థిక లావాదేవీల కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడుగురు విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో విషపదార్థంతో కూడిన ఓ సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

  ఢిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ హత్య

  ఢిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిలక్ నగర్‌లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. సదరు మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు రప్పించి ప్రియుడు గురుప్రత్ సింగ్ హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్‌లో చుట్టి రోడ్డు పక్కన పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌, కార్ నెంబర్‌ ఆధారంగా నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గుర్‌ప్రీత్‌ మెుబైల్‌లో డజన్ల కొద్దీ మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లు కనుగొన్నారు. మానవ అక్రమ రవాణా కోణంలో … Read more

  ఐటీశాఖ రూ.102 కోట్లు స్వాధీనం

  ఏపీ, తెలంగాణ, కర్ణాటక, దిల్లీలో సోదాలపై ఐటీశాఖ వివరణ ఇచ్చింది. మొత్తం 55 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారుల నివాసాల్లో సోదాలు చేసినట్లు చెప్పింది. ట్యాక్స్ కట్టని రూ.102 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ తెలిపింది. ఇందులో 94 కోట్ల విలువైన నగదు, రూ.8కోట్ల విలువైన బంగారు నగలు ఉన్నట్లు పేర్కొంది.

  జీ20 సదస్సుకు ముస్తాభైన ఢిల్లీ

  జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ అందంగా ముస్తాభైంది. సభా వేదికతో పాటు ఢిల్లీలోని అన్ని ప్రధాన కూడలిలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 40కి పైగా ప్రపంచ దేశాల అధినేతలు, VVIPలు, వ్యాపార వేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 40వేల మంది పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. సదస్సుకు ఎలాంటి అవాంతరం కలగకుండా ఢిల్లీ నుంచి సాగే 160 దేశీయ విమాన సర్వీసులు, 207 రైళ్లను ఈనెల 9, … Read more

  ఉప్పొంగిన వరద.. నీటమునిగిన ఢిల్లీ

  దేశ రాజధాని ఢిల్లీని వరద ముంచెత్తింది. అతి భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి వరదలు పొటెత్తాయి. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. రహదారులపై దాదాపు మనిషి ఎత్తు వరద పారుతోంది. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. ఢిల్లీలోని ఎర్రకోట చుట్టూ వరద నీరు చేరింది. రోడ్లపై ఉన్న వాహనాలన్నీ నీట మునిగాయి. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. #WATCH | A rickshaw-puller pedals through chest-deep water in the … Read more

  పట్టపగలే రెచ్చిపోయన దొంగలు

  [VIDEO](url): ఢిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కారును ఆపి రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తి క్యాబ్‌లో గురుగ్రామ్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ లోపలికి కారు ప్రవేశించగానే రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు నడి రోడ్డుపైనే కారును ఆపారు. ఆపై తుపాకీతో బెదిరించి కారు వెనుక సీటులో ఉన్న నగదు బ్యాగుతో ఉడాయించారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఘటనను ఖండించారు. Unknown daylight attackers robbed … Read more

  ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

  దేశ రాజధాని ఢిల్లీలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవాళ సాయంత్రం సూర్యుడు చుట్టు ఓ రంగురంగుల వలయం ఏర్పడింది. ఇంద్రధనస్సును పోలిన ఈ వలయం ఢిల్లీ వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మేఘాల్లోని మంచు స్పటికాల గుండా సూర్యకిరణాలు వంగి ప్రయాణించినప్పుడు ఇలాంటి వలయాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఇలాంటి వలయాలు ఏర్పడుతాయని చెప్పారు. A #halo can be observed around sun right now from … Read more

  బైక్‌కు నిప్పుపెట్టిన మహిళ.. వీడియో వైరల్

  [VIDEO](url): ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్‌ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె అందులో నుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. ఇందుకు సంబంధించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాసేపటికే మరో బైక్‌ నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు యత్నించగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. ఆ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత … Read more

  కోలాహలంగా మసీదుల పరిసరాలు

  [VIDEO](url): రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా నేడు దేశమంతా ఈదుల్ ఫితర్ జరుపుకుంటోంది. ముస్లిం సోదరులు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ముంబయిలోని మహిమ్ దర్గా, హైదరాబాద్‌లోని మక్కా మసీదు వద్ద పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్ బలయ్ ఇచ్చుకున్నారు. దీంతో మసీదుల పరిసరాలు కోలాహలంగా మారాయి. #WATCH | Delhi: People gather at Jama Masjid to offer namaz on the occasion of #EidAlFitr pic.twitter.com/8gQO9jRbxs — ANI … Read more