• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!

    షారుక్‌ ఖాన్ లేటెస్ట్‌ మూవీ ‘జవాన్’ (Jawan) ఇండియన్‌ బాక్సాఫీస్‌ (Indian Box Office) వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్‌ కలెక్షన్స్‌.  ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్‌ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే ఫస్ట్‌ డే నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయి. తాజాగా జవాన్‌ మూవీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే జవాన్‌ చిత్రం తొలిరోజు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టడం విశేషం.

    కృష్ణాష్టమి సందర్భంగా (సెప్టెంబర్‌ 7) రిలీజైన జవాన్‌ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పైగా షారుక్‌ ఖాన్‌ (Shahrukh khan)కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డ్స్‌ బద్దలు కొట్టే ఛాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘జవాన్’ డే 1 గ్రాస్‌ లెక్కల విషయానికి వస్తే వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ గ్రాస్‌ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే జవాన్‌ కంటే ముందు పలు చిత్రాలు హైయస్ట్‌ గ్రాస్‌ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూళ్లను సాధించిన టాప్‌-10 భారతీయ చిత్రాలు (Highest Opening Day Grossers In Indian Cinema) ఏవో ఇప్పుడు చూద్దాం. 

    1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022)

    ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం.

    2. బాహుబలి 2 (2017)

    రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది. 

    3. కేజీఎఫ్‌ 2 (2022)

    ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం. 

    4. ఆదిపురుష్‌ (2023)

    ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి.

    5. సాహో (2019)

    ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది. 

    6. రోబో 2.0 (2018)

    తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసినరోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు. 

    7. పఠాన్‌ (2023)

    ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. 

    8. జైలర్‌ (2023)

    రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది. 

    9. కబాలి (2016)

    2016లో వచ్చిన ‘కబాలి’ (Kabali) చిత్రం ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ తొలి రోజు భారీ వసూళ్లనే సాధించింది. ఈ మూవీ మెుదటి రోజు రూ.90.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. జైలర్‌ ముందు వరకు రజనీకాంత్‌కు ఫస్ట్‌ డే హైయస్ట్ గ్రాసింగ్‌ మూవీగా ‘కబాలి’ ఉంటూ వచ్చింది. 

    10. పొన్నియన్ సెల్వన్‌ (2022)

    మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ (Ponniyin Selvan: Part I) మూవీ తొలి రోజున రూ. 83.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రీసెంట్‌గా విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ 2’ తమిళంలో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీలో విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv