టాలీవుడ్ అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).. ఇటీవల బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది.
‘భగవంత్ కేసరి’ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు.. కాజల్ నటనపై కూడా ప్రశంసలు కురిశాయి. తాజాగా ఈ చిత్రానికి గాను ‘జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – JIFF’ (Jaipur International Film Festival)లో కాజల్‌ను ఓ అవార్డు వరించింది.
కాజల్‌తో (Kajal Agarwal) పాటు ప్రకాష్ (బింబిసారా), అనుపమ్ ఖేర్ (కార్తికేయ 2), అర్జున్ రాంపాల్ (భగవంత్ కేసరి) సైతం JIFF అవార్డులకు ఎంపికయ్యారు.
గత కొంతకాలంగా అవకాశాలు లేక తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్ ‘భగవంత్ కేసరి’ ద్వారా గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది. తాజా అవార్డుతో కాజల్ మరోమారు ఇండస్ట్రీలో పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కాజల్.. ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే కాజల్‌కు తిరుగుండదు. అందుకే కాజల్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అలాగే హిందీలో ‘ఉమా’, తెలుగులో సత్యభామ అనే రెండు చిత్రాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే మూడు పదుల వయసులోనూ కాజల్ (#KajalAggarwal) యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఆమె ఫిట్‌నెస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు.
అయితే తన అందం, ఫిట్‌నెస్ వెనకున్న రహాస్యాలను కాజల్ పంచుకున్నారు. కొన్ని ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్‌కు తెలియజేశారు.
ప్రతీ రోజు సూర్య నమస్కారాలు చేస్తానని కాజల్ అగర్వాల్ (#KajalAggarwal) తెలిపింది. వారంలో కనీసం మూడు రోజుల యోగా తప్పనిసరి అని పేర్కొంది.
అయితే ప్రతీరోజూ రొటీన్‌గా ఒకే రకమైన వ్యాయమం కాకుండా విభిన్నంగా ట్రై చేస్తుంటానని కాజల్ తెలిపింది. మధ్య మధ్యలో స్విమ్మింగ్ కూడా చేస్తుంటానని చెప్పుకొచ్చింది.
ఇక డైట్ విషయంలోనూ కాజల్ చాలా జాగ్రత్తగా ఉంటుందట. వ్యాయామానికి తగిన ఫుడ్ తీసుకుంటూ ఉంటానని గతంలో తెలిపింది.
నాన్ వెజ్ కంటే ఎక్కువగా వెజ్‌కే ఈ బ్యూటీ ప్రాధాన్యం ఇస్తుందట. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని కాజల్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.