• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New OTT Releases Telugu: ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద ఒకే ఒక్క సినిమా.. ‘కల్కి’ వైపే అందరి చూపు!

    గత కొన్ని వారాలుగా పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్న సినీ అభిమానులకు ఈ వారం గ్రాండ్ ట్రీట్‌ లభించబోతోంది. ఎప్పుడెప్పుడా అని యావత్‌ దేశం ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. అయితే కల్కికి పోటీగా ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాకపోవడం గమనార్హం. కాబట్టి ఈ వారం థియేటర్లో ప్రభాస్‌ ఒక్కరే సందడి చేయనున్నారు. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు

    కల్కి 2898 ఏడీ

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్‌ ఉంది. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్‌ 27న (Kalki 2898 AD Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా అలరించనుంది. కాశీ, కాంప్లెక్స్‌, శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పౌరాణిక పాత్రలను జత చేసి నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని తీర్చిదిద్దారు. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు

    లవ్‌ మౌళి

    నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌ మౌళి’ (Love Mouli). ఫంకూరీ గిద్వానీ (Pankhuri Gidwani) హీరోయిన్‌గా చేసింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ అలరించేందుకు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha).. ఈ సినిమాను జూన్‌ 27 నుంచి స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది. 

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    Worst Roommates Ever 2SeriesEnglishNetflixJune 26
    SupacellSeriesEnglishNetflixJune 27
    That Nineties 2 SeriesEnglishNetflixJune 27
    A Family AffairMovieEnglishNetflixJune 28
    Owning Maan HattenSeriesEnglishNetflixJune 28
    Civil WarMovieTelugu DubAmazon June 28
    Sharma Ji Ki BetiMovieHindiAmazon June 28
    Rautu Ka Raaz MovieHindiZee 5June 28
    The BearSeriesEnglishHotstarJune 27
    Land Of WomenMovieEnglishApple TV PlusJune 27
    Fancy Dance MovieEnglishApple TV PlusJune 28
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv