ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంపై [నిరసన](url)లు ఫిఫా వరల్డ్ కప్ కు చేరాయి. నిన్న పోర్చుగల్, ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చి ఇరాన్ ఆందోళనలపై నిరసన తెలిపాడు. ఇరాన్ మహిళలను గౌరవించండి అనే టీషర్ట్ ధరించాడు. రెయిన్ బో రంగుల జెండా పట్టుకొని మైదానంలో కొద్దిసేపు పరిగెత్తాడు. అతడిని వెంబడించిన భద్రతా సిబ్బంది బయటకు పంపించారు. ఇప్పటికీ పలుసార్లు అతడు ఇలా నిరసనలు తెలిపాడని పేర్కొన్నారు.