ఎంబాపే బొమ్మతో మార్టినేజ్, విమర్శకుల చివాట్లు
అర్దెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్ చేసిన ఓ పని విమర్శలకు దారితీస్తోంది.ప్రపంచకప్ గెలిచిన తర్వాత విజయ యాత్రలో భాగంగా ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే ఫొటోను చిన్నాపిల్లాడికి తగిలించిన బొమ్మను పట్టుకొని పాల్గొన్నాడు. దీంతో అగ్రశ్రేణి ఆటగాడిని అవమానించడం సరికాదని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. విశ్వవిజేతలుగా నిలిచి ఇలాంటి పనులు హేయమైనవని కామెంట్లు పెడుతున్నారు. మార్టినేజ్ ఎల్లప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటాడని వ్యాఖ్యానించారు.