• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Teaser: టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోన్న ‘పుష్ప 2’ టీజర్‌.. కారణం ఏంటంటే?

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా చేస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తోంది. ఇవాళ అల్లు అర్జున్ (HBD Allu Arjun) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. సినిమాలో ఎంతో కీలకమైన జాతర సన్నివేశానికి సంబంధించిన క్లిప్‌ను టీజర్‌ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. 

    టీజర్‌లో ఏముంది?

    ‘పుష్ప 2’కు సంబంధించిన లేటెస్ట్‌ టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్‌ అవతారంతో గూప్‌బంప్స్‌ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్‌ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్‌’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్‌ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డేకు ఈ టీజర్‌ పర్ఫెక్ట్ గిఫ్ట్‌ అని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. 

    రిలీజ్‌ ఎప్పుడంటే?

    పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ 2021లో విడుదలై సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv