• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Saif Ali Khan: ‘దేవర’ షూటింగ్‌లో ప్రమాదం.. సైఫ్ అలీఖాన్‌కు తీవ్రగాయాలు

  జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతుండగా ఇవాళ అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్‌లో సైఫ్‌ అలీఖాన్‌ భుజానికి గాయమైంది. దీంతో సైఫ్‌ అలీఖాన్‌ ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది.

  గాయాలకు కారణమదే?

  హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ వేసి ‘దేవర’ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ జరుగుతున్న క్రమంలోనే సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan Injure) చేతికి బలమైన గాయమైనట్లు సమాచారం. దీంతో ఆయన హుటాహుటీనా ముంబయికి వెళ్లిపోయారు. చేతికి కట్టుతో సైఫ్‌ ఎయిర్‌పోర్టులో దిగడంతో స్థానిక మీడియా ఈ దృశ్యాలను చిత్రీకరించింది. అవి కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సైఫ్‌ వెంట ఆయన భార్య కరీనా కపూర్ ఉన్నట్లు తెలుస్తోంది. 

  దేవర షూటింగ్‌కు బ్రేక్‌!

  సైఫ్‌ అలీఖాన్‌ గాయపడటంతో దేవర షూటింగ్‌కు కొన్ని రోజుల పాటు బ్రేక్‌ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ జరిగిన అయోధ్య రామమందిరం కార్యక్రమానికి తారక్‌ (Jr NTR) హాజరు కావాల్సి ఉంది. అయితే షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల తారక్‌ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేదు. అటు సైఫ్‌ అలీఖాన్‌  (Saif Ali Khan Injure) సైతం షూటింగ్‌ వల్ల అయోధ్యకు వెళ్లలేకపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  ఆ సీక్వెన్స్‌ మూవీకే హైలెట్‌!

  ‘దేవర’ చిత్రం రెండు పార్టులుగా రానుంది. తొలి భాగం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. వీటి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోవడం గమనార్హం. కాగా, దేవరలో వచ్చే అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv