• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Saif Ali Khan: ‘దేవర’ షూటింగ్‌లో ప్రమాదం.. సైఫ్ అలీఖాన్‌కు తీవ్రగాయాలు

    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan)విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతుండగా ఇవాళ అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్‌లో సైఫ్‌ అలీఖాన్‌ భుజానికి గాయమైంది. దీంతో సైఫ్‌ అలీఖాన్‌ ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. గాయాలకు కారణమదే? హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ వేసి ‘దేవర’ యాక్షన్‌ సీక్వెన్స్‌ను … Read more

    హైదరాబాద్ వచ్చేసిన జాన్వీ కపూర్

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్30’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ క్రమంలో జాన్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రామోజీఫిలింసిటీలో బస చేస్తున్నట్లు సమాచారం. కాగా ‘ఎన్టీఆర్30’ మూవీకి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో ఎన్టీఆర్, జాన్వీలపై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు టాక్.

    తిరుమలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

    [VIDEO](url): బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని జాన్వీ దర్శించుకుంది. ఈ మేరకు తిరుమల సన్నిధిలో మీడియాకు కనిపించింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్వీ పలు సినిమాలతో మెప్పిస్తోంది. #WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji … Read more

    సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్

    NTR30 వర్కింగ్ టైటిల్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మేరకు సెట్‌లోకి వెళ్తున్న ఓ [వీడియో](url)ను ఎన్టీఆర్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘కొరటాల శివతో మళ్లీ సెట్స్‌లో ఉండటం చాలా బాగుంది’ అంటూ రాసుకొచ్చాడు. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భయమంటే తెలియని వారికి భయాన్ని ఎలా పరిచయం చేశాడనే లైన్‌తో రూపొందుతోంది. జాన్వీ కపూర్ కథానాయిక. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. … Read more

    NTR30 షూటింగ్ ప్రారంభోత్సవం

    కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR30 షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు చిత్ర బృందం పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్, జాన్వీకపూర్, కళ్యాణ్ రామ్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించండి.

    NTR30: జాన్వీ కపూర్‌కు భారీ రెమ్యూనరేషన్‌!

    NTR30 చిత్రంలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆమె రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలకు రూ.3 నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్న జాన్వీ.. తెలుగులో లాంచ్ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసింది. కాగా RC15లో నటిస్తున్న మరో బాలీవుడ్‌ కియారా రూ.3.5 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. కల నెరవేరింది టాలీవుడ్‌లో తారక్‌తో నటించాలని ఉన్నట్లు చాలాకాలంగా చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఆమె పేరు ఎక్కువగా … Read more

    శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

    దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె దర్శనానికి వచ్చారు. ఆలయ సిబ్బంది జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా జాన్వీ కపూర్ రావడంతో తిరుమలలో సందడి నెలకొంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    జాన్వీ కపూర్ లేటెస్ట్ హాట్ పిక్స్

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజా ఫొటో షూట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్లూకలర్ పొట్టి జీన్స్, వైట్ కలర్ స్ర్పింగ్ సమ్మర్ ధరించి కొంటె చూపులతో ఈ అమ్మడు ఫోజులిచ్చింది. కాళ్లు, చేతులతో పలు రకాల స్టిల్స్ ఇస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది. తనను ఈ డ్రెస్సులో చూసిన అభిమానులు తెగ ఫిధా అవుతున్నారు. మరోవైపు ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. Courtesy Instagram: Courtesy Instagram: … Read more

    తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న జాన్వీక‌పూర్

    బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది. స్నేహితుల‌తో క‌లిసి తిరుమ‌ల వచ్చిన ఆమె మొక్కును తీర్చుకుంది. బ్లూ క‌ల‌ర్ లంగాఓణీలో అచ్చ‌తెలుల‌మ్మ‌యిల క‌నిపించింది. జాన్వీ న‌టించిన గుడ్‌ల‌క్ జెర్రీ సినిమా ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఆమె మిస్ట‌ర్ అండ్ మిసెస్ మాహి, బ‌వాల్ సినిమాల‌తో బిజీగా ఉంది. షూటింగ్ నుంచి కాస్త‌ గ్యాప్ దొర‌క‌డంతో ఇలా భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయింది.

    సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న జాన్వీక‌పూర్‌

    జాన్వీక‌పూర్ త‌న లేటెస్ట్ ఫోటోషూట్‌ల‌తో సోష‌ల్‌మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆమె తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఇటీవ‌లే ‘గుడ్‌ల‌క్ జెర్రీ’ సినిమాతో ఆమె ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌ర్వాత రూహీ, తక్త్, బ‌వాల్, హెలెన్ వంటి వ‌రుస బాలీవుడ్ సినిమాలో బిజీగా ఉంది. అవ‌కాశం వ‌స్తే సౌత్‌లోనూ న‌టించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్ సినిమాతో తెలుగులో ప‌రిచ‌యం కాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Courtesy Instagram: Janhvi Kapoor Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more