కన్నడ నటి శోభితా శివన్న (Shobhitha Shivanna) హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానస్పద ఆమె ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం శోభిత సూసైడ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాలోనూ హైలెట్ అవుతోంది. ఈ నేపథ్యంలో శోభిత శివన్న గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శోభిత శివన్న (Shobhitha Shivanna Suicide) వ్యక్తిగత వివరాలకు వస్తే ఆమె 1992 సెప్టెంబర్ 23న బెంగళూరులో జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం చేసింది.
బాల్డ్‌విన్ గర్ల్స్ హై స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో గ్రాడ్యుయేషన్ చేసింది.
కెరీర్ ప్రారంభంలో కన్నడ ఛానెల్ రాజ్ మ్యూజిక్‌లో వీజే (వీడియో జాకీ)గా పని చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సీరియల్స్, సినిమాల్లోకి అడుగుపెట్టింది.
2015లో వచ్చిన కన్నడ ఫిల్మ్ ‘రంగితరంగ’తో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది.
ఆ తర్వాత చేసిన ‘ఎరదొండ్ల మూరు’, ‘ఏటీఎం’, ‘అటెంప్ట్ టూ మర్డర్’, ‘జాక్‌పాట్’ చిత్రాలు కన్నడ ఇండస్ట్రీలో ఆమెకు గుర్తింపు తెచ్చాయి.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ ఆమె నటించింది. ‘గాలిపట’, ‘మంగళ గౌరి’, ‘బ్రహ్మగంటు’, ‘కృష్ణ రుక్మిణి’ సీరియల్స్‌లో శోభిత శివన్న నటించింది.
హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం శోభిత (Shobhitha Shivanna Suicide) కు ఘనంగా వివాహమైంది.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుధీర్‌రెడ్డిని మ్యాట్రిమోని పరిచయంతో శోభిత వివాహమాడింది.
వివాహం తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు శోభిత మకాం మార్చింది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ సీ బ్లాక్‌లోని ఓ ఇంట్లో ఆమె భర్తతో కలిసి అద్దెకు ఉంటోంది.
శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన అనంతరం ఆమె గదిలోకి వెళ్లి నిద్ర పోయింది. భర్త పక్క గదిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు.
ఆదివారం ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేళాడుతూ శోభిత కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు ఈ విషయం తెలిసిన సాధారణ ప్రజలు సైతం షాకయ్యారు.
పెళ్లైనప్పటి నుంచి శోభిత శివన్న (Shobhitha Shivanna) నటనకు దూరంగా ఉంటున్నారు. భర్తతోనే హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఆమెకు ఏం వచ్చిందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఒక వేళ భర్త సుధీర్ రెడ్డితో ఏమైన గొడవలు జరిగాయా? కాపురంలో సమస్యలు ఉన్నాయా? లేదా డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శోభిత పోస్టుమార్టం (Shobhitha Shivanna) నివేదిక సైతం బయటకు వచ్చింది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, అది ఆత్యహత్యేనని వైద్యులు తేల్చారు. శోభిత స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..