బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే కొద్దిరోజుల క్రితం వరకూ అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. వాటికి అదే స్థాయిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అనసూయ కౌంటర్లు ఇస్తూ వచ్చింది. ఏమైందో ఏమో గాని కొని ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో అంతా యాక్టివ్‌గా ఉండటం లేదు. దేని గురించి పెద్దగా రియాక్ట్ కావడం లేదు. దీంతో అనసూయ పేరు పెద్దగా చర్చకు రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదాస్పద పోస్టుతో మరోమారు అనసూయ చర్చనీయాంశంగా మారింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండను మళ్లీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
అనసూయ పోస్టు ఏంటంటే?
‘పుష్ప 2’ చిత్రంలో నటి అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో ఆమె చేసిన దాక్షయణి రోల్ సెకండ్ పార్ట్‌లోనూ కొనసాగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అనసూయ పాల్గొంది. గ్లామర్ లుక్స్‌లో కనిపించి సందడి చేసింది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమోగాని ఎక్స్‌లో ఓ సెన్సేషన్ పోస్టు అనసూయ పెట్టింది. ‘దూరపు కొండలు నునుపు’ అంటూ అందులో రాసుకొచ్చింది. అయితే దీనికి ఎవరి పేరును ట్యాగ్ చేయలేదు. దీంతో ఆమె ఏ ఉద్దేశ్యంతో చేసింది? ఎవరి కోసం చేసింది? అన్న విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
రౌడీ బాయ్ గురించేనా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నటి అనసూయ (Anasuya Bharadwaj)కు ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి ఇది కొనసాగుతూ వస్తోంది. విజయ్ను విమర్శిస్తూ ఆమె బహిరంగంగానే పలుమార్లు మాట్లాడింది. అయితే తాజాగా పెట్టిన పోస్టు కూడా విజయ్ను ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘దూరపు కొండలు నునుపు’ అన్న మాటల్లో కొండ అని ఉండటాన్ని హైలెట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఈవెంట్లో హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడింది. ఆమె స్పీచ్ ఇచ్చిన విధానం, మాట తీరు అచ్చం విజయ్ దేవరకొండ స్టైల్లో ఉన్నాయన్న కామెంట్స్ వినిపించాయి. పైగా వారిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న రూమర్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనసూయ ఇలా పోస్టు పెట్టి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
రష్మిక కంటే శ్రీలీలకే ప్రాధాన్యత!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఉన్న నెగిటివిటీని హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)పై కూడా అనసూయ (Anasuya) చూపించిందన్న వాదనలు నెట్టింట వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘పుష్ప 2’తో ఇది మరోమారు నిరూపితమైందని నెటిజన్లు అంటున్నారు. ‘పుష్ప 2’ (Pushpa 2)లో హీరోయిన్గా చేసిన రష్మికతో కంటే స్పెషల్ సాంగ్‌లో కనిపించిన శ్రీలీలతోనే ఆమె ఎక్కువ చనువుగా ఉందని గుర్తు చేస్తున్నారు. శ్రీలీలను ఆటపటిస్తున్న వీడియోలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ వీడియోలో శ్రీలీల, అనసూయ నవ్వుతూ జోక్స్ వేసుకోవడం గమనించవచ్చు.
అనసూయ ప్రస్థానం
జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్గా ‘రజాకార్’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ‘ఫ్లాష్ బ్యాక్’, ‘ఉల్ఫ్’ చిత్రాల్లో అనసూయ నటిస్తోంది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి