యావత్ దేశంలోని సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మోస్ట్ వాంటెడ్ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో ఆ సినిమాను తట్టుకొని నిలబడేందుకు ఈ సినిమా సాహించలేదు. దీంతో ఈ వీక్ ఒకే ఒక్క సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. మరోవైపు ఓటీటీ (OTT Releases This Week Telugu)లో మాత్రం పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రం
పుష్ప 2 (Pushpa 2)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘పుష్ప 2’ దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ (Pushpa 2 Advance Booking) సైతం మెుదలయ్యాయి. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఓటీటీలోకి వచ్చే చిత్రాలు / వెబ్ సిరీస్‌లు
అమరన్ (Amaran)
పాన్ ఇండియా స్థాయిలో (OTT Releases This Week Telugu) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్ తమిళ చిత్రం ‘అమరన్’ (Amaran OTT Platform). అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు.
మట్కా (Matka)
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka OTT Platform)కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వస్తోంది. మరీ ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందా లేదా చూడాలి.
విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)
యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Releases This Week Telugu) నటించిన లేటెస్ట్ చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. శోభనం రోజు వీడియో చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘జిగ్రా’ (Jigra OTT Platform). ఈ చిత్రం కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వాసన్ బాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీ (OTT Releases This Week Telugu)లో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కంగువా (Kanguva)
తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కంగువా’ (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. డిసెంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తర్ టాక్ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.
Title | Category | Language | Platform | Release Date |
Churchill At War | Documentary | English | Netflix | Dec 04 |
That Cristamas | Animation | English | Netflix | Dec 04 |
The Only Girl In The Orchestra | Documentary | English | Netflix | Dec 04 |
The Alitimatam | Series | English | Netflix | Dec 04 |
Black Doves | Movie | English | Netflix | Dec 05 |
A Nonsense Cristamas | Movie | English | Netflix | Dec 06 |
Mary | Movie | English | Netflix | Dec 06 |
Jack in Time For Cristamas | Movie | English | Amazon | Dec 03 |
Pop Culture Zeppady | Series | English | Amazon | Dec 04 |
Agnee | Movie | Hindi | Amazon | Dec 06 |
Longing | Movie | English | Jio Cinema | Dec 07 |
The Original | Series | English/Korean | Hot star | Dec 03 |
Light Shop | Series | English/Korean | Hot star | Dec 04 |
Mairy | Movie | Hindi | Zee 5 | Dec 06 |
Tanav 2 | Movie | Hindi/Telugu | SonyLIV | Dec 06 |
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..