సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). రష్మిక మందన్న కథానాయికగా చేసింది. మరో నటి శ్రీలీల (Sreeleela) ఐటెం సాంగ్‌లో నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ వేడుకలో అల్లు అర్జున్ అతి చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అతడి ప్రవర్తన ఏమాత్రం సమంజసంగా లేదని మండిపడుతున్నారు. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎలాగంటే?
‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సోమవారం (డిసెంబర్ 2) రాత్రి జరిగింది. యూసఫ్‌గూడ పోలీసు గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడకకు అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్ సహా మూవీ టీమ్ అంతా హాజరైంది. దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ‘పుష్ప 2 గురించి అల్లు అర్జున్ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడాడు. స్పీచ్ ఇస్తున్న సమయంలో స్టేజీపై బన్నీ అటు తిరిగాడు. ముఖ్యంగా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా నిర్మించి స్టేజీ ముందుభాగానికి నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో అభిమానులు అతడి వద్దకు రాకుండా నిలువరించేందుకు బౌన్సర్లు పరిగెత్తుకు వెళ్లాల్సి వచ్చింది. అంతకముందు స్టేజీపైకి ఓ అభిమాని పరిగెత్తుకు రాగా అతడ్ని నిలువరించేందుకు బౌన్సర్లు శ్రమించారు. అల్లు అర్జున్ నడిచిన రైలింగ్ చాలా తక్కువ ఎత్తులో ఉంది. ఫ్యాన్స్ ఈజీగా దానిపైకి ఎక్కెయ్యవచ్చు. బన్నీ నడుస్తున్న సమయంలో బౌన్సర్లకు, సెక్యురిటీ గార్డ్లకు చెమటలు పట్టాయి. ఎక్కడ అభిమానులు దూసుకొస్తారేమోనని కంగారు పడ్డారు. దీంతో ఈ వ్యవహారమంతా చూసిన నెటిజన్లు అల్లు అర్జున్ కాస్త అతి చేశాడని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమాని బన్నీ వద్దకు వచ్చిన వీడియోను సైతం ఎడిటింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
‘రామ్‌చరణ్‌ను చూసి నేర్చుకో’
‘పుష్ప’ సక్సెస్ అల్లు అర్జున్‌లో గర్వాన్ని తీసుకొచ్చిందని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కుర్చీలో కూర్చొని ఉన్న బన్నీతో ఓ బాలిక సెల్ఫీ దిగేందుకు యత్నించగా అతడు కాలుపై కాలు వేసుకొని ఆ పాప ముందు అహం ప్రదర్శించాడని ఆరోపిస్తున్నారు. అంతేకాదు బన్నీ ఫ్యామిలీతో ఉన్న కటౌట్‌ను హైలేట్ చేయడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఇప్పుడు సక్సెస్ చూసి గర్వ పడితే ఆ తర్వాత బాధ పడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. గతంలో తమ అభిమాన హీరో రామ్‌చరణ్ చెప్పిన కొన్ని వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఎలా ఉండాలో చరణ్‌ను చూసి నేర్చుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.
పవన్ మంచి మనసు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో జారి చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800 నిర్ణయించింది (జీఎస్టీ అదనం). ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం రూ.800+GST చెల్లించాలి. పుష్ప 2 రిలీజ్ రోజు డిసెంబర్ 5న ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ రూ.100 (జీఎస్టీతో కలిపి), అప్పర్ క్లాస్ రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లెక్స్‌లో రూ.200 (జీఎస్టీతో కలిపి) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబరు 17 వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. తమ హీరోనూ అల్లు అర్మీ ఎంత దూషించిన ‘పుష్ప 2’ టికెట్ల పెంపు విషయంలో పవన్ మాత్రం మంచి మనసు చాటుకున్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..