RRR చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. RRR చిత్రంతో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా రాజమౌళి గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తీయబోయే SSMB29 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మహేష్‌ను జక్కన్న ఎలా చూపిస్తారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మూడు భాగలుగా..
మహేశ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రం మూడు పార్ట్‌లుగా రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఒకసారి సినిమా ప్రారంభమైతే అది రూ.1500 కోట్లకు కూడా పెరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికన్ యాక్టర్ జెన్నా ఒర్టెగా (Jenna Ortega) రాజమౌళి సినిమాలో నటిస్తారని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే జెన్నాతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
హలీవుడ్ యాక్టర్లు
మూడు పార్టులుగా తెరకెక్కబోయే రాజమౌళి సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం పనిచేస్తారని సమాచారం. SSMB 29, 30, 31 కూడా రాజమౌళి చేతిలోనే ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రానున్న8 ఏళ్లలో ఈ పార్టులు రిలీజ్ అవుతాయని చర్చించుకుంటున్నారు. మూడు పార్టులకు 8 ఏళ్లు అంటే మహేష్ ఏం చేస్తారోనని ఇప్పటినుంచే ఆయన అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. అప్పటివరకు మరో సినిమాలో మహేష్‌ను చూడలేమా అంటూ దిగులు చెందుతున్నారు. అయితే రాజమౌళితో వరుసగా మూడు సినిమాలంటే మామూలు విషయం కాదని తమకు తామే ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు.
హీరోయిన్లు వీళ్లేనా?
SSMB29లో మహేశ్ సరసన నటించబోయే హీరోయిన్ల గురించి కూడా నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహేశ్ సినిమాలో మెుత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని టాక్. బాలీవుడ్ నటి అనుష్క శర్మ, హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ హీరోయిన్లుగా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా థర్డ్ హీరోయిన్‌గా సారా అలీఖాన్( Sara Alikhan) పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళికి సారా పేరును బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సూచించారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, చియాన్ విక్రమ్, కేరళ నటుడు పృథ్వీరాజ్ కూడా నటిస్తారని ఇటీవలే విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.
ప్రస్తుతం మహేష్ SSMB 28 షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూాజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ శ్రీలీల కూడా సినిమాలో సందడి చేయనుంది. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ లోపు ఫినిష్ చేసేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. SSMB28 షూట్ పూర్తికాగానే రాజమౌళి సినిమాపై మహేష్ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం