బండ్లన్న స్పీచ్.. మళ్లీ ఇరగదీశాడు
బండ్ల గణేశ్ స్పీచ్‌కి అభిమానులు చాలామందే ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు అలా పూణకాలు తెప్పిస్తుంటాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో స్పీచ్‌తో అలరించిన బండ్ల గణేశ్…రవితేజ ధమాకా సక్సెస్ మీట్‌లోనూ అదేస్థాయిలో రెచ్చిపోయారు. ఈ వేడుకకు తానే వస్తానని ఫోన్ చేసి నిర్మాతలకు చెప్పినట్లు వెల్లడించారు. రవితేజ ఎంతోమంది దర్శకులకు జీవితం ఇచ్చాడన్నారు. తనదైన ప్రాసలు, పంచ్‌లతో మరోసారి బండ్లన్న స్పీచ్ ఇరగదీశాడు అంటున్నారు.