• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేడు శ్రీలంకతో భారత్‌ పోరు

  వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి లేకుండా టీమిండియా దాదాపుగా సెమీస్‌ చేరింది. కానీ అధికారికంగా బెర్తు సొంతం కావాలంటే నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో టీమిండియా గెలవాలి. శ్రీలంకతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మరో ఘనవిజయం, దాంతో పాటు సెమీస్‌ బెర్తు సొంతమైనట్లే. ఇకపోతే ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఓడి సెమీస్‌ రేసులో శ్రీలంక వెనుకబడింది.

  థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు వీసా అక్కర్లేదు

  థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో విసా లేకుండా 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తాగాగా భారత్‌, తైవాన్‌ దేశాలకు ఈ అవకాశం కల్పించింది. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్‌లాండ్‌ వీసా మినహాయింపును ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం శ్రీలంక భారత్‌ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది.

  ఆ దేశానికి వెళ్లాలంటే.. 1000 డాలర్ల ఫీజు కట్టాల్సిందే!

  భారత్‌, ఆఫ్రికా దేశాలకు ఎల్‌ సాల్వడార్‌ షాకిచ్చింది. ఇకపై తమ దేశంలోకి రావాలంటే 1000 డాలర్ల ఫీజు కట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఎల్‌ సాల్వడార్‌ అధికారికంగా వెల్లడించింది. తమ దేశం మీదుగా అమెరికాకు వలసలను తగ్గించే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా ఆదేశాల మేరకు భారత్, 57 ఆఫ్రికా దేశాల ప్రయాణికులు ఇకపై ఎల్‌ సాల్వడార్‌ వెళ్లాలంటే.. వ్యాట్, ఇతర ఛార్జీలతో కలిపి 1130 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

  నేవీ మాజీ అధికారులుకు మరణశిక్ష!

  భారత నౌకాదళ మాజీ అధికారులుకు ఖతార్‌ కోర్టు మరణశిక్ష విధించింది. గూఢచర్యం ఆరోపణలపై 8 మందికి శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది. చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాల కోసం అన్వేషిస్తున్నామని చెప్పింది. ఈ తీర్పుకు సంబంధించిన విషయాన్ని ఖతర్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

  కెనడా వీసా సేవలు భారత్ పునరుద్ధరణ

  కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కెనడాతో దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తడంతో భారత్ కెనడా పౌరుల వీసా సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే..

  పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌

  దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలని NCERT పేర్కొంది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని వెల్లడించింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని NCERT వెల్లడించింది.

  Asian Games: భారత్‌దే బంగారు పతకం

  ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు స్వర్ణం గెలుచుకుంది. తొలుత టాస్‌ నెగ్గి భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో 18.2 ఓవర్లకు 112/5 స్కోరు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. అప్పటికి వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో భారత్‌ గెలిచినట్లు ప్రకటించారు.

  Asian Games: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణం

  ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటి వరకు భారత్ 101 పతకాలు సాధించింది. అందులో 26 స్వర్ణాలు, 35 రజతం, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా కీడల్లో భాగంగా భారత్-అఫ్గాన్ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం 18.2 ఓవర్లు పూర్తయ్యే సరికి అఫ్గాన్ 1121/5 పరుగులు చేసింది.

  Asian Games: భారత్‌తో అఫ్గాన్ ఫైనల్ పోరు

  ఆసియా క్రీడల్లో భాగంగా నేడు రెండో సెమీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టును అఫ్గానిస్థాన్ ఓడించింది. ఈ క్రమంలో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 115 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన అఫ్గాన్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్-పాక్ పోరును చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ తలపడనుంది.

  Ind vs Aus: పక్కా ప్లానింగ్‌తో ఉన్నాం: కమిన్స్

  వన్డే ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా అక్టోబర్ 8న చెన్నై వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భారత స్పిన్నర్లను తమ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. భారత్‌తో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో తలపడిన సందర్భాలు ఉన్నాయి. భారత బౌలర్లు ఎలా వేస్తారనేదానిపై మా బ్యాటర్లకు అవగాహణ ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉంటాయి. మేం విజయం సాధించగలమన్న నమ్మకం ఉంది. భారత గడ్డపై వన్డేల్లో మెరగైన రికార్డే ఉంది’. అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.