రాహుల్ గాంధీ యాత్ర రద్దు
జమ్ము కశ్మీర్లో జరగాల్సిన ఇవాళ్టి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా వెనుదిరిగారు. “ పోలీసు బందోబస్తు పూర్తిగా కుప్పకూలింది. రద్దీని నియంత్రించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించట్లేదు. నా భద్రత సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే యాత్రను రద్దు చేసుకున్నా. మిగతా నేతలు పాదయాత్రను కొనసాగించారు. పోలీసులు రద్దీ నియంత్రిస్తే యాత్ర కొనసాగించవచ్చు. నా భద్రతా సిబ్బంది సిఫార్సునకు వ్యతిరేకంగా వెళ్లను” అన్నారు.