పీఎస్ఎల్ జరుగుతున్న మైదానం సమీపంలో పేలుడు
పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలో పేలుడు సంభవించింది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు షాహిద్ అఫ్రిదీ ఆడుతున్నారు. వారిని భద్రతా సిబ్బంది తక్షణమే డ్రెస్సింగ్ రూమ్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెహ్రీక్ ఈ తాలిబన్ సంస్థ బ్లాస్ట్‌కు పాల్పడినట్లు ప్రకటించింది.