• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

  పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ వీడియో వదిలారు. ఈ చిత్రం మొదటి వారం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రెండో వారంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. https://twitter.com/karanjohar/status/1570634809009143808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570634809009143808%7Ctwgr%5Ea7a2d6ea5a681b6db9ae3aa602f463a3db4f710e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6454159011845084414.ampproject.net%2F2208242209000%2Fframe.html

  ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఫుల్‌ రివ్యూ

  బాలివుడ్‌ బాక్సాఫీస్‌కు కోటి ఆశలనిస్తూ ఇవాళ విడుదలైన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అమితాభ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.400కోట్ల ఈ భారీ బడ్జెట్‌తో సరికొత్త ‘అస్త్రలోకం’గా తీర్చిదిద్దిన ఈ సినిమాను అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. దక్షిణాన  రాజమౌళి సమర్పణ బాధ్యతలు తీసుకున్నారు. మరి సినిమా అంచనాలు అందుకుందా? రివ్యూలో చూద్దాం కథ: బ్రహ్మాస్త్ర సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథ అంతా బ్రహ్మాస్త్రను కాపాడే బ్రహ్మాన్ష్‌ అనే బృందం … Read more

  ఎయిర్‌పోర్టులో ట్రెడీష‌న‌ల్ లుక్‌లో ర‌ణ్‌బీర్, ఆలియా

  ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ముంబ‌యి ఎయిర్‌పోర్టులో ఇద్ద‌రూ ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌నిపించారు. వారితో పాటు ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ కూడా ఉన్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన ఈ జంట తెలుగులో మాట్లాడి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. బ్ర‌హ్మాస్త్ర మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. నాగార్జున‌, అమితాబ్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

  బాలీవుడ్ బాక్సాఫీస్‌పై చీకట్లను ‘బ్రహ్మాస్త్ర’ చీల్చగలదా?!

  పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల వద్ద జనం క్యూ కట్టేవారు. సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్ గా మలిచేవారు. కానీ ఈ ఏడాది బాలీవుడ్ లో హంగామా పూర్తిగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. మిగతావన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. దక్షిణాది చిత్రాలు మెరిసిపోతుండటం, ఓటీటీ హవా కూడా పెరగడంతో అక్కడి వెండితెరకు గిరాకీ తగ్గింది. వచ్చిన సినిమా వచ్చినట్టు థియేటర్ల ముందు బోల్తా పడుతుంటే బీటౌన్‌లో తెలియని అలజడి మొదలైంది. బాలీవుడ్ … Read more

  ‘విజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మాస్త్ర’ గురించి చెప్పిన రాజ‌మౌళి

  ‘బ్ర‌హ్మాస్త్ర’ మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మాస్త్ర గురించి వివ‌రించాడు. 2016లో ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ నాకు ఈ క‌థ గురించి చెప్పాడు. మ‌న పురాణాల ఆధారంగా తెర‌కెక్కిన ఈ క‌థ న‌న్ను ఎంత‌గానో ఆక‌ర్షించింది. పంచ‌భూతాల‌ను శాసించే బ్ర‌హ్మ శ‌క్తి నుంచి పుట్టిన అస్త్రాలు, వాటిని ఉప‌యోగించే సూప‌ర్ హీరోల గురించే చెప్పే స్టోరీ ఇది అని వివ‌రించాడు. బ్ర‌హ్మాస్త్ర సినిమాను నాలుగు ద‌క్షిణాధి భాష‌ల్లో రాజ‌మౌళి రిలీజ్ చేస్తున్నాడు.

  బ్రహ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న ఆలియాభ‌ట్

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ఆలియా భ‌ట్ మ‌రికొన్ని రోజుల్లో త‌ల్లి కాబోతుంది. ప్ర‌స్తుతం ఆమె ‘బ్ర‌హ్మాస్త్ర’ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. బ్ర‌హ్మాస్త్ర మొద‌టి భాగం శివ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. భ‌ర్త ర‌ణ్‌బీర్‌తో క‌లిసి ఆమె ఈ సినిమాలో న‌టించింది. తాజాగా ఆలియా, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ క‌లిసి క‌ర‌ణ్ జోహార్ ఆఫీస్‌లో క‌నిపించారు. బ్లూ క‌ల‌ర్ షార్ట్‌ టాప్‌పై వైట్ క‌ల‌ర్ కోట్‌తో ఆలియా స్టైలిష్‌గా క‌నిపించింది. బ్ర‌హ్మాస్త్ర‌లో అమితాబ్, నాగార్జున‌, మౌనీరాయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

  కుంకుమలా వీడియో సాంగ్ రిలీజ్

  రియల్ లైఫ్ భార్యా, భర్తలు రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. పురాణాల్లోని అస్త్రాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమితాబ్, నాగార్జున వంటి స్టార్ హీరోలు ఇందులో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కుంకుమలా’ పాట ప్రేక్షాకాదరణ సంపాదించగా తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అది కూడా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.