• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబుపై మరో కేసు

    టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు.

    ఆ ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు: లోకేష్

    IRR కేసులో టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు లోకేష్‌ను దాదాపు 47 ప్రశ్నలు అడిగారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియా మాట్లాడారు. హైకోర్టు ఒక్కరోజే విచారణకు హాజరవ్వాలని చెప్పింది. అధికారుల నోటీసు మేరకు రెండో రోజు హాజరైయ్యా.. వాషింగ్‌ మెషిన్‌లో తిప్పినట్లు మంగళవారం అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు’ అని లోకేష్ తెలిపారు.

    దానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదు: లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను ప్రశ్నించారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. నన్ను సీఐడీ 50 ప్రశ్నలు అడిగింది. అందులో ఈ కేసులో నేను ఎలా లాభపడ్డానో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కక్ష సాధింపు కోసమే నాపై ఎలాంటి ఆధారాలు లేని కేసు పెట్టారు. మళ్లీ రావాలని … Read more

    లోకేష్ సీఐడీ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత లోకేష్ సీఐడీ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం లోకేష్ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

    నారాయణకు మరోసారి నోటీసులు

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మీద ఉన్న నారాయణను విచారణకు హాజరు కావాల్సిందిగా వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో నారా లోకేష్‌ను ఇటీవల ఏ14గా చేరుస్తూ సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    చంద్రబాబు ఆరోగ్యం బాలేదు: లాయర్లు

    చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన తరఫు లాయర్లు స్పందించారు. ‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాం. హైబీపీ, షూగర్ ఉంది. బేయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించాం. కేసుతో సంబంధం లేని సెక్షన్లను చంద్రబాబుపై నమోదు చేశారు. న్యాయపోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు. సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ??? ????????-Former Andhrapradesh CM Chandrababu Naidu arrested in the Skill development case. #Chandrababunaidu#G20India #tdp #CBN #TDPAndrapradesh … Read more