• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • త్వరలో పెళ్లి చేసుకుంటా: అనుష్క

  సమయం కలసి వస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపింది. తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రమోషన్లలో అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లాడుతా. ఇక సినిమాలో అన్విత పాత్రలో నటించాను. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టం. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా హిట్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  రాజకీయంగా నా మద్ధతు పవన్‌కే: రేణు దేశాయ్

  రాజకీయంగా తన మద్ధతు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కేనని ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ అన్నారు. ‘‘పవన్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేదలకు ఎప్పుడూ మంచి చేయాలని అనుకుంటారు. అందుకోసమే పవన్ తన కుటుంబాన్ని పక్కన పెట్టారు. నా విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ ప్రతీసారి మూడు పెళ్లిళ్లు అంటూ పవన్‌ను విమర్శించొద్దు. మూడుపెళ్లిళ్లపై ఇక చర్చ ఆపేయండి. పవన్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించవద్దు.’’ అంటూ రేణు కోరారు. I still believe & feel that he … Read more

  అతడిలో నాకు నచ్చేది అదే: శృతిహాసన్

  స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తన ప్రియుడు శంతను హజారికా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు శృతి తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడింది. ‘‘శంతనుకు చాలా టాలెంట్ ఉంది. నన్ను చాలా ఇష్టపడతాడు. చాలా కేరింగ్‌గా ఉంటాడు. అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తాడు. నాకు అతడి కళ్లు అంటే చెప్పలేనంత ఇష్టం. అతడిలో నాకు నచ్చేవి అవే.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.

  నాకు ప్రెగ్నెంట్ కావాలనుంది: హీరోయిన్

  తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేర్కొంది. ‘‘ప్రెగ్నెంట్ సమయంలో నాకు నచ్చింది తినవచ్చు. అడ్డు చెప్పేవారే ఉండరు. నాకు పుట్టబోయే బిడ్డ ఎవరైనా ఒకటే. ఆడ, మగ ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే చాలు.’’ అంటూ చెప్పుకొచ్చింది. కియారా తన ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. కాగా కియారా ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్‌ఛేంజర్’ చిత్రంలో నటిస్తోంది.

  తమన్నా అంటే పిచ్చి: విజయ్ వర్మ

  స్టార్ హీరోయిన్ తమన్నా అంటే తనకు పిచ్చి అని నటుడు విజయ్ వర్మ అన్నాడు. ‘‘తమన్నా అంటే నాకు ఎంతో ఇష్టం. మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని నాకు బాగా అర్ధమవుతోంది. ఆమెతో చాలా సంతోషంగా ఉన్నా. ఆమె రాకతో నా జీవితంతో విలన్ దశ ముగిసింది. రొమాంటిక్ దశ మొదలైంది.’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా తమన్నా-విజయ్ కలసి ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్2’లో నటించారు. ఆ సినిమా షూట్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు టాక్.

  అందుకే సింగిల్‌గా ఉంటున్నా: సదా

  పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ లభించదని.. అందుకే తాను వివాహానికి దూరంగా ఉన్నానని హీరోయిన్ సదా తెలిపింది. ‘‘ప్రస్తుతం సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఇష్టమొచ్చినట్లు ఉంటున్నా. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉంటాయో లేదో తెలీదు. మనల్ని అర్ధం చేసుకునే వారు దొరికితే బాగుంటుంది. కానీ అలా జరగపోతే పరిస్థితి ఏంటీ? ఇప్పుడు చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకుని.. కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకుంటున్నారు. దీనికంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  తెలుగు హీరోలపై తమన్నా ప్రశంసలు

  టాలీవుడ్ హీరోలపై స్టార్ హీరోయిన్ తమన్నా ప్రశంసలు కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ‘‘తెలుగు హీరోలు సంస్కారవంతులు. మహిళల పట్ల మర్యాదగా వ్యవహరిస్తారు. సెట్‌లో హీరోయిన్‌ల పట్ల అపార గౌరవంతో ఉంటారు. ఇది వాళ్ల ఇంట్లో తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని ఉంటారు. ఈ విషయంలో ఇతర భాషల హీరోలకు, తెలుగు హీరోలకు చాలా తేడా ఉంటుంది. అందుకే వాళ్లతో నటించడానికి హీరోయిన్లు పోటీపడతారు.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  అది ధరిస్తే నిర్మాతలకు నచ్చదు: నటి

  టాప్ లేకుండా ఆడిషన్స్‌కు వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతుందని బాలీవుడ్ నటి అర్చనా గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ముంబైలో చదువుకునేటప్పుడు సినీ పరిశ్రమకు చెందిన ఓ మహిళ పరిచయమైంది. నాకు సినిమాలపై ఆసక్తి ఉన్నట్లు ఆమె గుర్తించింది. కానీ ఆడిషన్స్‌కు వెళ్తున్నప్పుడు షార్టులు వేసుకుని వెళ్లాలని చెప్పింది. అలాగే పై భాగంలో టాప్ కూడా లేకుండా వెళ్తే నిర్మాతలు నచ్చుతారని తెలిపింది. తొలుత ఆమె మాటలు ఆశ్చర్యం కలిగించినా అదే నిజమైంది.’’ అంటూ పేర్కొంది.

  నాకు పెళ్లి చేసుకోవాలనుంది: కంగనా రనౌత్

  తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. ‘‘నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకంటూ సొంత కుటుంబం ఉండాలని ఉంది. కానీ నేను తొందర పడితే అది జరగదు. ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. ’’ అంటూ కంగనా చెప్పుకొచ్చింది. కాగా కంగనా ప్రస్తుతం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బయోపిక్ ‘ఎమర్జెన్సీ’లో నటిస్తోంది. ‘చంద్రముఖి2’ సినిమాలోనూ నటిస్తోంది.

  ‘సౌత్‌’లో నెపోటిజం ఎక్కువ: అవికా గోర్

  హీరోయిన్ అవికా గోర్ సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. ఇది బాలీవుడ్‌తో పోల్చుకుంటే చాలా తక్కువ. స్టార్ హీరోల పవర్ మీదే సౌత్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తోంది. హిందీ చిత్రాలను సౌత్ ఆడియన్స్ ఆదరించరు. బాలీవుడ్ సినిమాలను పెద్దగా ఇష్టపడరు. టాలీవుడ్ మొత్తం బంధుప్రీతితో నిండి ఉంది. అక్కడి ప్రజలు కూడా దానిని ఇష్టపడుతున్నారు. భవిష్యత్‌లో ఇది కనిపించకపోవచ్చు.’’ అంటూ అవికా సంచలన వ్యాఖ్యలు చేసింది.