పెళ్లి చేసుకుని.. ఉన్నదంతా దోచేసి..!
పక్కా ప్లాన్ ప్రకారం వృద్ధుడిని రెండో పెళ్లి చేసుకుని ఇంట్లోని సంపదను దోచేసిందో మహిళ. కర్ణాటకకు చెందిన షణ్ముగం(69) భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన మల్లిక(35)తో పరిచయం ఏర్పడింది. ఓ ఇద్దరు సాక్షుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అనంతరం కొన్ని రోజులకే ఇంట్లోని 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 700 గ్రాముల వెండి వస్తువులను కాజేసింది. తన భార్య కనిపించడం లేదంటూ షణ్ముగం వెతకసాగాడు. అనంతరం మోసపోయానని గ్రహించి కాటన్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.