దీపావళి పండుగ.. చైనాకు లక్ష కోట్లు నష్టం!
చైనాను అన్ని విధాలుగా నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్‌కాట్ చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ ఏడాదిలో దీపావళి రోజు దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు సుమారు రూ.1లక్ష కోట్లు నష్టం వాటిల్లింది. గతంలో దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. ఈ మేరకు ఓ నివేదిక పేర్కొంది.