• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హమాస్‌పై దాడికి ఇజ్రాయెల్ సరికొత్త ఆయుద్ధం

    హమాస్ మిలిటెంట్లపై ప్రయోగించేందుకు ఇజ్రాయెల్ తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీస్తోంది. తాజాగా ఐరన్ స్టింగ్ అనే ఆయుధ వ్యవస్థను రంగంలోకి దించింది. గాజాలో జనవాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంఛర్లను ధ్వంసం చేసేందుకు ఐరన్ స్టింగ్ అనే ఆయుధాన్ని వాడటం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. తొలిసారి యుద్ధంలోకి ఈ ఆయుధాన్ని తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

    మరో ఇద్దరు బందీలను వదిలిపెట్టిన హమాస్

    మరో ఇద్దరు బందీలను హమాస్ మిలిటెంట్లు తమ చెర నుంచి వదిలి పెట్టారు. మానవత దృష్టితో ఇద్దరు వృద్ధులను విడిచి పెట్టినట్లు పేర్కొన్నారు. వీరిద్దరు ఇజ్రాయేల్ దేశస్థులు. వారం క్రితం ఇద్దరు అమెరికాకు చెందిన తల్లి కూతుళ్లను హమాస్ ఉగ్రవాదులు విడిచి పెట్టారు. ప్రస్తుతం తమ వద్ద 222 మంది బందీలుగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు హమాస్‌పై దాడుల ఉద్ధృతిని పెంచనున్నట్లు ఇజ్రాయేల్ ప్రకటించింది. తాము హమాస్‌ పూర్తిగా ధ్వంసం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

    హమాస్ మిలిటెంట్ల మారణ హోమం

    ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు మారణ హోమం సృష్టించారు. ఒకే సారి 260 మంది ప్రాణాలు తీసి కర్కశంగా వ్యవహరించారు. గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్ వద్ద జరిగిన ఓ మ్యాజిక్ పార్టీకి దాదాపు 3 వేల మంది హాజరుకాగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో వారంతా కార్లలో పారిపోయేందుకు ప్రయత్నించగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారిపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మరికొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు.

    యుద్ధం కోరుకోలేదు.. కానీ తప్పడం లేదు

    ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తాము మొదలు పెట్టలేదని.. అయితే ముగింపు మాత్రం తామే ఇస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ యుద్దం కోరుకోలేదని, అయినప్పటికీ దేశం కోసం తప్పడం లేదని చెప్పారు. హమాస్ సైతం ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థేనని, ప్రజలంతా ఏకమై దానిని ఓడించాలని కోరారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే నాగరిక ప్రపంచం మొత్తం గెలిచినట్లేనని ఆయన అన్నారు.

    యద్ధం ఎఫెక్ట్: పెరిగిన చమురు ధరలు

    ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ చమురు ధర నాలుగు శాతానికి పైగా పెరిగి 87.5 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఎస్‌ రకం ధర 85.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చమురు సరఫరాలపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.