• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం

    తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు వేడిమి, రాత్రి తీవ్రమైన చలితో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం హైదరాబాద్‌- హయత్ నగర్‌లో సాధారణం కన్నా తక్కువగా 21 డిగ్రీలు, మెదక్‌లో 5 డిగ్రీలు తక్కువగా 13.4, రామగుండంలో 2.4 డిగ్రీలు తక్కువగా 17.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కాగా ఈరోజు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

    తీవ్ర తుపాన్‌గా బలపడిన ‘హమూన్’

    బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్‌కు ‘హమూన్‌’గా పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. తీవ్ర తుపాన్గా మారిన హమూన్.. ఈశాన్య దిశగా కదులుతోంది. ఒడిశాలోని పారాదీప్కు ఆగ్నేయంగా, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నం బంగ్లాదేశ్ చిట్టగాంగ్, ఖేప్ పురా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా భారత్‌లో ఏడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు

    ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 3రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 23 వరకు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. అయితే ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.