• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • “అది BCCI చెత్త లాజిక్‌”

  భారత్‌ ఓటమి అనంతరం నెటిజన్లు బీసీసీఐ నిర్ణయాలు, ప్రణాళికలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. “విదేశీ ఆటగాళ్లు IPL ఆడటానికి వచ్చి, ఇండియా వాతావరణానికి అలవాటు పడతారు. మన ఆటగాళ్ల బలాబలాలు తెలుసుకుంటారు. కానీ మన వాళ్లు మాత్రం విదేశాల లీగ్‌లకు వెళ్లకూడదు అయినా అక్కడ అద్భుతంగా రాణించాలి. ఇదేం చెత్త లాజిక్‌” అంటూ మండిపడుతున్నారు. మరోవైపు IPL బ్యాన్‌ చేయాలంటూ రచ్చ చేస్తున్నారు.

  భారత జట్టులో సీనియర్లకు సెలవు

  టీ20 వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత జట్టులో భారీ మార్పులకు BCCI సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు సెలవు ఇవ్వాలని BCCI భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023కి యువ జట్టుకే ప్రాధాన్యత ఇస్తామని బీసీీసీఐ అధికార వర్గాలు తెలిపాయని పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. రోహిత్‌, కోహ్లీ, అశ్విన్‌, డీకే లాంటి ఆటగాళ్లపై కాకుండా యువతరం దృష్టి పెడతామని చెప్పినట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్‌ చేయమని బీసీసీఐ ఎవర్నీ కోరదని కానీ, 2023 వరల్డ్‌ కప్‌లో యువ ఆటగాళ్లనే తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

  ఐపీఎల్ వల్ల లాభమా? నష్టమా?

  ఇంగ్లాండుపై టీమిండియా ఓటమితో మరోసారి ఐపీఎల్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. ‘ఓడిపోయినా ఏం ఫర్వాలేదు.. మనకు ఐపీఎల్ ఉంది కదా. రండి ఇక్కడ ఆడి గెలుద్దాం’ అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఐపీఎల్ వల్ల టీమిండియాకు నష్టమా? లాభమా? అనేది అందరి మదిని తొలిచే ప్రశ్న. దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. కొత్త టాలెంట్‌ని వెలికితీయొచ్చని కొందరు అంటుంటే.. ఆటగాళ్లకు పని ఒత్తిడి పెరుగుతోందనేది మరో వాదన. దేశం తరఫున ప్రధాన టోర్నీలకు దూరం కావడానికి, ఆశించిన మేర ప్రదర్శన చేయకపోవడానికి … Read more

  ‘ప్లేయర్ల స్ట్రైక్ రేటు పెరగాలి’

  ఇంగ్లాండుపై ఓటమి అనంతరం టీమిండియా ప్లేయర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇది మరింత తీవ్రంగా ఉంది. అయితే, భారత బ్యాట్స్‌మన్ స్ట్రైక్ రేట్‌ని మెరుగు పరుచుకోవాలంటూ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటివారు తమ స్ట్రైక్ రేట్‌ని మరింత మెరుగు పరుచుకోవాలని సూచించాడు. విరాట్ కోహ్లీ బాగానే అడుతున్న తక్కువ స్ట్రైక్ రేట్ ఉంటోందని తెలిపాడు. ఇక రాహుల్, రోహిత్ పూర్తిగా తమ ఆట తీరును మార్చాల్సిందేనని చెబుతున్నారు. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.

  ఇండియా ఓటమి.. పాక్ సంబరం

  సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పాక్ కాస్త ఊపిరి పీల్చుకుంది. టీమిండియాతో పోలిస్తే ఇంగ్లండుపై ఆడేటప్పుడు అంతగా ఒత్తిడి ఉండదు. పైగా, 1992 ప్రపంచకప్‌లో జరిగినట్లే ఇప్పుడూ జరగడంతో వారు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై 1992 వన్డే ప్రపంచకప్ జరిగింది. ఇందులో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిచింది. ఈ వరల్డ్‌కప్‌లోనూ పాక్ విజయం సాధించింది. అలాగే ఫైనల్‌కి ఇంగ్లాండ్ వెళ్లింది. ఇప్పుడు కూడా ఫైనల్‌కి చేరుకోవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, 1992 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లాండుపై పాకిస్థాన్ గెలిచింది.

  INDvsENG: అందుకే ఓడిపోయాం: రోహిత్‌ శర్మ

  ఒత్తిడిని జయించలేకనే తాము ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. నాకౌట్‌ గేమ్స్‌లో ఒత్తిడిని జయించడం ముఖ్యం, పాక్‌, బంగ్లా మ్యాచుల్లో మేం ఒత్తిడిని జయించి, మా ప్రణాళికలు అమలుపరిచాం. కానీ, ఈరోజు అది చేయలేకపోయాం. ఐపీఎల్‌లో ఆడటం వారికి బాగా కలిసొచ్చింది. బ్యాటింగ్‌లో చివర్లో మా బ్యాటర్లు చెలరేగినా , బౌలర్లు ఇవాళ అది చేయలేకపోయారు” అని రోహిత్‌ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.

  పాత కథే! ఇంటిబాట పట్టిన టీమిండియా!

  వరల్డ్‌ కప్‌కు వచ్చే ముందు టీమిండియా బౌలింగ్‌ ప్రదర్శనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సూపర్‌ 12 స్టేజ్‌లో విజయాలతో కాస్త నమ్మకం కలిగించారు. కానీ తప్పక గెలవాల్సిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. 2014 నుంచి నాకౌట్‌ గేమ్స్‌లో పేలవ ప్రదర్శనలతో ఇంటిబాట పడుతున్న టీమిండియా మరోసారి అదే రిపీట్‌ చేసింది. ఫైనల్‌కు చేరేందుకు ఇంగ్లండ్‌తో పోరులో ఘోర పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి తొలు బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ భారత ఓపెనర్లను బాగా కట్టడి చేసింది. రాహుల్‌, కోహ్లీ మరోసారి నిరాశపరిచారు. … Read more

  చివరి 10 ఓవర్లో టీమిండియా ఊచకోత

  వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు చివరి 10 ఓవర్లలో బౌలర్లను ఊచకోత కోశారు. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. తొలి 15 బంతుల్లో 13 పరుగులు సాధించిన పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులతో చెలరేగాడు. చివరి 5 ఓవర్లలో ఇండియా 68 పరుగులు రాబట్టింది. చివరి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు చేసింది. చివర్లో హార్దిక్ హిట్‌ వికెట్‌ కాకుంటే మరో 4 పరుగులు కలిసేవి.

  ముగిసిన ఇన్నింగ్స్.. టార్గెట్ 169

  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా వీరవిహారం చేశాడు. 33బంతుల్లో 63 పరుగులు చేసి ఇండియాకు గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. ఈ ప్రపంచకప్‌లో హార్ధిక్‌కి ఇది తొలి అర్ధశతకం కాగా, టీ20ల్లో విరాట్ కోహ్లీ 4వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.

  హార్ధిక్ పాండ్యా వీరవిహారం

  ఉత్కంఠగా సాగిన ఇన్నింగ్సులో టీమిండియా 168 పరుగులు చేసింది. ఈ మ్యాచుకి హార్ధిక్ ఆటే హైలైట్. తొలి పది బంతుల్లో హార్ధిక్ తక్కువ స్కోరే చేశాడు. కోహ్లీ ఔటయ్యాక హార్ధిక్ వేగం పెంచాడు. చివరి మూడు ఓవర్లలో హార్ధిక్ పాండ్యా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18వ ఓవర్లో రెండు సిక్సులు బాదగా, 19వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ని బాదాడు. చివరి ఓవర్లోనూ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని బౌండరీగా మలిచినా హార్ధిక్ కాలు వికెట్లను తాకడంతో అంపైర్ … Read more