• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాని30’: మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ‘నాని30’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సౌరవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర విశేషాల గురించి మృణాల్ మాట్లాడింది. ‘‘ ఇంత మంచి స్క్రిప్ట్ నా జీవితంలో ఎప్పుడూ చదవలేదు. ఇంత మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది.’’ అంటూ ఈ సీతారామం బ్యూటీ చెప్పుకొచ్చింది.

    నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి; సమంత

    వైవాహిక బంధంలో తాను నిజాయతీగా ఉన్నానని.. కానీ అది ఉపయోగపడలేదని స్టార్ హీరోయిన్ సమంత పేర్కొన్నారు. ‘‘ చైతూతో విడాకులు తీసుకున్న వెంటనే ‘పుష్ప’ మూవీలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. నువ్వు ఇంట్లో కూర్చో చాలు.. విడిపోయిన వెంటనే ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు అని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ నేను వాళ్ల సలహాను అంగీకరించలేదు. నేనే నేరం చేయలేదు. మరి అలాంటప్పుడు ఇంట్లోనే ఎందుకు కూర్చుని ఉండాలి.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చారు.

    ఆ హీరోతో నటించాలని ఉంది; కీర్తి సురేష్

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో నటించాలని ఉందని స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతడితో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని పేర్కొంది. షారుఖ్‌కు తాను వీరాభిమానినని తెలిపింది. కాగా కీర్తిసురేష్ నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కీర్తిసురేష్ చిత్ర ప్రమోషన్లలో బిజిబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ముంబైలో ప్రమోషన్లు చేస్తోంది. Screengrab Instagram: keerthysureshofficial Screengrab Twitter:iamsrk

    ‘కాంతారా’ చూసి ఆశ్చర్యపోయా; దర్శకుడు రాజమౌళి

    మొదటిసారిగా[ ‘కాంతారా’ ](url)సినిమా చూసి ఆశ్చర్యపోయానని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. తాము ఇలాంటి చిత్రాన్ని ఎందుకు తీయడం లేదని ప్రశ్నించుకున్నారు. ఈ మూవీ నాలాంటి దర్శకులను ఒత్తిడిలోకి నెట్టేసిందని ప్రశంసించారు. చిత్ర నిర్మాణ ప్రక్రియను పున సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రేక్షకుల పరంగా ఇది ఒక అద్భుత చిత్రమని కొనియాడారు. కలెక్షన్లు రావాలంటే కంటెంట్ ఉండాలని ఈ చిత్రం నిరూపించిందని రాజమౌళి పేర్కొన్నారు. .@ssrajamouli and @PrithviOfficial discussing the magic of #Kantara on the Filmmakers' Adda … Read more