ఐటీ ఉద్యోగులకు మరో ఏడాది నిరాశే
ఐటీ రంగానికి సంబంధించిన తాజా నివేదిక ఒకటి ఐటీ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. 2024లో సైతం ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని ప్రముఖ ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌కు చెందిన విశ్లేషకులు వెల్లడించారు. అయితే 2025లో మాత్రం పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు 2024ని ‘వాష్ అవుట్’గా పేర్కొంటారని, ఇక 2025పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగితే ప్రతికూల పరిస్థితులే ఉంటాయని ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు హెచ్చరించాయి.