యువతికి నిప్పంటించిన ఉన్మాది
జార్ఖండ్లో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని యువతికి నిప్పంటించాడో ఉన్మాది. తనను పెళ్లి చేసుకోవాలని 19ఏళ్ల యువతిని రాజేశ్ రౌత్ రెండేళ్లుగా వేధిస్తున్నాడు. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. ఇటీవల యువతికి వేరొకరితో వివాహమైంది. దీంతో రాజేశ్ వివాహితకు నిప్పంటించాడు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే, వీరిద్దరికీ 2019నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.