ఝార్ఖండ్‌లోని దేవ్‌ధర్‌లో ఆదివారం రోప్ వే కేబుల్ కార్ల ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంతో దాదాపు 50 మందికి పైగా కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాంకేతిక కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.
ఇంకా ఐదుగురు ఆపదలోనే..
ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఐదుగురు కేబుల్ కార్లలోనే చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మందిని రక్షించినప్పటికీ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. రెండు Mi-17 విమానాలతో భారత వైమానిక దళ సిబ్బంది కూడ పర్యాటకులను రక్షించే బాధ్యతను తీసుకుంది. ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి ..ఘటనకు గల కారణాలు ఈనెల 26లోగా తెలపాల్సిందిగా కోరింది.
దేశంలోనే అత్యంత ఎత్తైన రోప్
ఈ త్రికూట్ రోప్ వే భారత్ లోనే అత్యంత ఎతైన వర్టికల్ రోప్ వే. త్రికూట పర్వతాల్లోని స్వామి వారిని దర్శించుకోవడానికి, అలాగే సరదాగా గడపడానికి ప్రయాణికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ రోప్ వే 766 మీటర్ల పొడవు ఉండగా, 25 క్యాబిన్లు ఉంటాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!