సైమా అవార్డ్స్: ఉత్తమ నటుడిగా కమల్ హాసన్
సైమా అవార్డుల ప్రదానోత్సవం దుబాయ్ వేదికగా ఘనంగా జరిగింది.ఈ వేడుకల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు హీరో హీరోయిన్లు సందడి చేశారు. శనివారం రాత్రి తమిళ, మలయాళం ఇండస్ట్రీ వారికి పురస్కారాలు అందించారు. ఉత్తమ నటుడిగా కమల్‌హాసన్, ఉత్తమ నటిగా త్రిష అవార్డులు దక్కించుకొన్నారు. ఉత్తమ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ 1 నిలిచింది. బెస్ట్ డైరెక్టర్‌గా లోకేష్ కనగరాజ్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ అవార్డులు అందుకున్నారు.