• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజగోపాల్‌రెడ్డిపై భాజపా రియాక్షన్ ఇదే!

    TG: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాకు రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఈ విషయంలో ఎవరి ఇష్టం వారిదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భారాసకు భాజపా ప్రత్యామ్నాయం కాదన్న వ్యాఖ్యలను ఖండించారు. భాజపా ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి జాతీయస్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అటు రాజగోపాల్‌రెడ్డిని పాసింగ్‌ క్లౌడ్‌గా ఎంపీ జితేందర్‌రెడ్డి అభివర్ణించారు. కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారని విమర్శించారు.

    కాంగ్రెస్‌ గూటికి రాజగోపాల్‌రెడ్డి?

    TG: నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి యూటర్న్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన భాజపాను వదిలి తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా భాజపాలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌వైపు చూస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరే విషయమై ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలతో రాజగోపాల్‌ చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. రేపు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో భేటి కూడా అవుతారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే భాజపాకు గట్టి షాక్‌ తప్పదు.

    బీజేపీలో చేరికపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

    నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికపై అక్కడి ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. తాను బీజేపీలో చేరడం లేదన్నారు. పార్లమెంటులో బహిరంగంగా అమిత్ షాతో మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు వెల్లడించారు. కేవలం నమస్తే తెలంగాణ పత్రికలో మాత్రమే అబద్ధపు వార్తలు రాశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు ఎందుకంత భయం పట్టుకుందని రాజగోపాల్ నిలదీశారు. కేసీఆర్ తెలంగాణకు 4 లక్షలకుపైగా అప్పులు చేశారని విమర్శించారు.