• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అలాంటి వాడినే పెళ్లాడుతా: ‘బేబీ’ హీరోయిన్

  మంచి మనసు ఉన్నవాడినే తాను పెళ్లి చేసుకుంటానని ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పింది. ‘‘నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఆస్తిపాస్తులు లేకపోయినా ఫరవాలేదు. అందంగా లేకపోయినా ఎలాంటి సమస్య లేదు. కానీ మంచి మనసు మాత్రం ఉన్నవాడై ఉండాలి. అలాంటి వాడితోనే నేను ఏడడుగులు వేస్తాను. ఇంతకంటే అతడి నుంచి నేను ఏమీ కోరుకోను.’’ అంటూ వైష్ణవి చెప్పుకొచ్చింది.

  త్వరలో పెళ్లి చేసుకుంటా: అనుష్క

  సమయం కలసి వస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపింది. తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రమోషన్లలో అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లాడుతా. ఇక సినిమాలో అన్విత పాత్రలో నటించాను. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టం. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా హిట్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  పెళ్లి చేసుకోవాలనుంది: నగ్మా

  తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని సీనియర్ హీరోయిన్ నగ్మా తెలిపింది. ‘‘కాలం కలిసి వస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని కోరుకుంటున్నా. నాకూ ఓ తోడు ఉండాలని.. పిల్లలు కావాలని అనిపిస్తుంది. నిజంగానే నాకు వివాహమైతే సంతోషంగా ఫీల్ అవుతా.’’ అంటూ 48 ఏళ్ల నగ్మా చెప్పుకొచ్చింది. కాగా గతంలో సౌరవ్ గంగూలీ, శరత్ కుమార్, మనోజ్ తివారీ, రవికిషన్‌లతో నగ్మా ప్రేమాయణం కొనసాగించిందని టాక్.

  అలాంటి వాడినే పెళ్లాడుతా: అనన్యపాండే

  నాకు కాబోయే వాడు దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉంటేనే పెళ్లాడతానని లైగర్ భామ అనన్య పాండే తెలిపింది. తాను నటించిన ‘డ్రీమ్ గర్ల్-2’ మూవీ ప్రమోషన్లలో అనన్య మాట్లాడుతూ ‘‘నాకు మా నాన్నే ఆదర్శం. ఆయనే నాకు అన్నింటిలో బెంచ్ మార్క్. నా తండ్రిలా దయ, ప్రేమ, ఫన్నీగా ఉండేవాడినే వివాహమాడుతా. మా నాన్న లాంటి లక్షణాలే అతనికి ఉండాలి.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా బాలీవుడ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

  రాహుల్ గాంధీని పెళ్లాడుతా: హీరోయిన్

  ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా తెలిపింది. ఇటీవల షెర్లిన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘రాహుల్‌కు నచ్చితే వివాహమాడుతా. కానీ ఆయనను వివాహం చేసుకోవడానికి ఓ కండీషన్ ఉంది. పెళ్లి తర్వాత నేను ఇంటి పేరు మార్చుకోను.’’ అంటూ పేర్కొంది. షెర్లిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా షెర్లిన్ ప్రస్తుతం పౌరాష్‌పూర్-2 అనే వెబ్‌సీరీస్‌లో నటించింది. ఈ సీరీస్ గత నెల 28న విడుదలైంది.

  అంజూ కేసులో మరో ట్విస్ట్

  ఫేస్‌బుక్ ప్రేమతో పాకిస్తాన్ వెళ్లిపోయిన భారత యువతి అంజూ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఆమె పాక్ యువకుడు నుస్రుత్ ఖాన్‌ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పేరును కూడా ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ పాక్‌లోని దిర్ జిల్లా కోర్టులో నిఖా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంజూ-నస్రూమ్‌లు కలసి సన్నిహితంగా మెలుగుతూ విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Nasrullah & Anju Love StoryIndia's Anju 'feels safe' in Pakistan#AnjuinPakistan #SeemaHaidar … Read more

  అందుకే సింగిల్‌గా ఉంటున్నా: సదా

  పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ లభించదని.. అందుకే తాను వివాహానికి దూరంగా ఉన్నానని హీరోయిన్ సదా తెలిపింది. ‘‘ప్రస్తుతం సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఇష్టమొచ్చినట్లు ఉంటున్నా. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉంటాయో లేదో తెలీదు. మనల్ని అర్ధం చేసుకునే వారు దొరికితే బాగుంటుంది. కానీ అలా జరగపోతే పరిస్థితి ఏంటీ? ఇప్పుడు చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకుని.. కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకుంటున్నారు. దీనికంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి

  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య పెళ్లి నిశ్చయమైంది. కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, హీరో ఉమాపతితో ఆమె వివాహం జరగనుంది. ఇరువర్గాల కుటుంబపెద్దలు పెళ్లి కుదిర్చారు. త్వరలోనే వీరి వివాహ తేదీని కూడా ఖరారు చేయనున్నారు. వచ్చే నవంబర్ 8న ఉమాపతి బర్త్‌డే సందర్భంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేయనున్నారు. కాగా ఐశ్వర్య, విశ్వక్‌సేన్ జంటగా ఓ తెలుగు సినిమా ప్రారంభమైంది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.

  అలాంటి వాడినే పెళ్లాడుతా: శోభితా ధూళిపాళ్ల

  తనకు కాబోయేవాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల తెలిపింది. తన కొత్త సినిమా ‘ది నైట్ మేనేజర్-2’ ప్రమోషన్లలో భాగంగా శోభితా మీడియాతో మాట్లాడింది. ‘‘నాకు కాబోయేవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. మంచి మనసు ఉండాలి. తోటి మనుషుల పట్ల జాలి, దయతో ఉండాలి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా నాగచైతన్య అక్కినేనితో శోభితా డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

  30 ఏళ్లకే పిల్లల్ని కనేస్తా అనుకున్నా: తమన్నా

  తనకు 30 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేసుకుని.. పిల్లలను కనేస్తానని అనుకున్నట్లు స్టార్ హీరోయిన్ తమన్నా తెలిపింది. ‘‘నా కెరీర్ ఆరంభంలో 8 నుంచి 10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉందామనుకున్నా. అలా 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లై పిల్లలు కనాలని అనుకున్నా. కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు వచ్చినా ఇప్పుడే పుట్టినట్లు ఉంది. ప్రస్తుతం నాకు పునర్జన్మ లభించినట్లుగా ఉంది. పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు బాధ్యత. ఆ బాధ్యత కలిగినప్పుడే పెళ్లి చేసుకోవాలి.’’ అంటూ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.