• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నాకు పెళ్లి చేసుకోవాలనుంది: కంగనా రనౌత్

  తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. ‘‘నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకంటూ సొంత కుటుంబం ఉండాలని ఉంది. కానీ నేను తొందర పడితే అది జరగదు. ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. ’’ అంటూ కంగనా చెప్పుకొచ్చింది. కాగా కంగనా ప్రస్తుతం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బయోపిక్ ‘ఎమర్జెన్సీ’లో నటిస్తోంది. ‘చంద్రముఖి2’ సినిమాలోనూ నటిస్తోంది.

  30 ఏళ్లకే పిల్లల్ని కనేస్తా అనుకున్నా: తమన్నా

  తనకు 30 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేసుకుని.. పిల్లలను కనేస్తానని అనుకున్నట్లు స్టార్ హీరోయిన్ తమన్నా తెలిపింది. ‘‘నా కెరీర్ ఆరంభంలో 8 నుంచి 10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉందామనుకున్నా. అలా 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లై పిల్లలు కనాలని అనుకున్నా. కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు వచ్చినా ఇప్పుడే పుట్టినట్లు ఉంది. ప్రస్తుతం నాకు పునర్జన్మ లభించినట్లుగా ఉంది. పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు బాధ్యత. ఆ బాధ్యత కలిగినప్పుడే పెళ్లి చేసుకోవాలి.’’ అంటూ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.

  LAVANYA TRIPATHI: పెళ్లికి ముందే కండీషన్.. ఏంటంటే?

  మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వారు ఇటలీలో వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే ఓ కండీషన్ పెట్టినట్లు సమాచారం. దానికి మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత కూడా తనకు ఇష్టమైన భరతనాట్యం చేస్తానని.. ఏదైనా స్టేజ్‌పై ఆ ఛాన్స్ వస్తే వదులుకోనని తేల్చి చెప్పిందట. సినిమాల్లో నటించకపోయినా ప్రొడక్షన్ పనులు చూసుకుంటానని కండీషన్ పెట్టినట్లు టాక్.

  శర్వానంద్ పెళ్లి సందడి షురూ

  టాలీవుడ్ హీరో శర్వానంద్, రక్షితారెడ్డిల పెళ్లి సందడి మొదలైంది. జైపూర్‌లోని లీలాప్యాలెస్‌లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హల్దీ వేడుక ప్రారంభమైంది. ఈ హల్దీ ఫంక్షన్‌లో సందడంతా శర్వానంద్‌దే. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో శర్వా తన స్నేహితులు, కజిన్స్‌కు పసుపు పూసి ఆటపట్టిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా రేపు రాత్రి 11 గంటలకు వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. శర్వా పెళ్లి సందడి ❤️ Lovely … Read more

  వివాహ బంధాలకు విలువే లేదు: దీపికా

  ప్రస్తుత తరంలో వివాహ బంధాలకు విలువ లేకుండా పోయిందని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణె పేర్కొంది. ‘‘నేటి తరం భార్యాభర్తలకు సహనం లేదు. ప్రస్తుత తరం వారు పాత తరం వారి నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలి. వివాహ బంధం ధృడంగా ఉండాలంటే సహనం ముఖ్యం. మన తల్లిదండ్రుల నుంచి కూడా మనం నేర్చుకోవాలి.’’ అంటూ తెలిపింది. కాగా 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను దీపికా పడుకొణె ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’ మూవీలో నటిస్తోంది.

  గురువును పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్లు!

  [VIDEO:](url) చత్తీస్‌ఘడ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు కలిసి వారి గురువును వివాహం చేసుకున్నారు. జంగీర్ చంపా జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. సంప్రదాయాల ప్రకారం మూడు రోజుల పాటు వివాహ వేడుకలను నిర్వహించారు. ట్రాన్స్‌ కమ్యూనిటీ ఆచరించే పద్ధతుల్లో పెళ్లిని జరిపించారు. సమాజ సంక్షేమం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు. దేశంలోని ట్రాన్స్ కమ్యూనిటీల్లో ఒకటైన ‘కిన్నెర సమితి’ ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించింది. #WATCH | In a unique three-day-long wedding … Read more

  త్వరలో దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి! వధువు ఎవరంటే?

  టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ త్వరలో వివాహం చేసుకోనున్నట్ల తెలుస్తోంది. 43 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ తమ దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవీకి ఆమె వరుసకు మరదలు అవుతుందని.. వారిద్దరి మధ్య 17 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు టాక్. పెళ్లి విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దేవిశ్రీప్రసాద్ గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. ఇదిలా ఉంటే గతంలో … Read more

  నరేష్, పవిత్ర జంటకు శుభాకాంక్షల వెల్లువ

  [VIDEO:](url) గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలు నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కలకాలం సంసారాన్ని సాఫీగా కొనసాగించండి అంటూ నెటిజన్లు నూతన జంటను ఆశీర్వదిస్తున్నారు. హైదరాబాద్‌కు కొద్ది దూరంలోని ఓ ఆలయంలో అగ్నిసాక్షిగా వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. నరేష్‌కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు కాగా, పవిత్రకు ఇది రెండో వివాహం. పెళ్లి చేసుకున్న నరేష్- పవిత్ర❤️ ❤️ … Read more

  పెళ్లి కోసం ఏకంగా విమానమే బుకింగ్

  ఓ వ్యక్తి తన పెళ్లి కోసం ఏకంగా విమానమే బుక్ చేసి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన నేపాల్‌లోని ఖాట్మండులో చోటుచేసుకుంది. భువన్ అనే యువకుడు తన మ్యారేజ్‌కు భారీగా ఖర్చు చేసి విమానం బుక్ చేశాడు. దీంతో ఎప్పుడూ విమానం ఎక్కని వారు కూడా విమానం ఎక్కి కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/Cn_7HAopJNe/?utm_source=ig_web_copy_link

  ఫేస్‌బుక్ ప్రేమ; భారత యువకుడితో స్వీడన్ యువతి పెళ్లి

  ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి స్వీడన్ నుంచి ఇండియా వచ్చింది. యూపీలోని ఎటా జిల్లాకు చెందిన పవన్‌కు స్వీడన్‌కు చెందిన క్రిస్టేన్ లైబర్ట్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. 2012 నుంచి వారు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి వివాహం చేసుకోవా లని నిర్ణయించుకున్నారు. దీంతో క్రిస్టేన్ స్వీడన్ నుంచి భారత్ వచ్చింది.బంధువులు, కుటుంబసభ్యుల మధ్య ఒక్కటయ్యారు. ఈ పెళ్ళికి సంబంధించిన [వీడియో](url)లు వైరల్‌గా మారాయి. Swedish woman flies to India to marry longtime boyfriend from Uttar … Read more