• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేడు డీజీపీలతో ప్రధాని మోదీ సమావేశం

  దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. శనివారం ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో ఈ సమావేశం జరగనుంది. సైబర్ క్రైమ్, టెక్నాలజీ పోలీసింగ్, కౌంటర్ టెర్రరిజం, వామపక్ష తీవ్రవాదం, జైళ్ల సంస్కరణలపై మోదీ చర్చించనున్నారు. కాగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 100 మంది డీజీపీలు, ఐజీలు సమావేశానికి హాజరవుతారు. మరికొందరు విర్చువల్‌గా సమావేశంలో పాల్గొంటారు.

  చంద్రబాబును కలసిన తలైవా

  ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు వీరు పలు విషయాలపై చర్చించుకున్నారు. పవన్‌-చంద్రబాబు భేటీ అనంతరం వెంటనే తలైవా కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి భేటీలో సినిమాలు, రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. తమ భేటీకి సంబంధించిన ఫొటోను చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

  నేడు హస్తినకు ఏపీ సీఎం జగన్

  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన హస్తినకు బయల్దేని వెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుని అక్కడ జన్‌పథ్ 1లోని సీఎం అధికారిక నివాసంలో బస చేస్తారు. బుధవారం ప్రధాని మోదీ భేటీ అవుతారు. ఏపీ అభివృద్ధికి నిధులు, పోలవరం, విభజన హామీలపై ప్రధానితో చర్చించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.

  తెలంగాణలో ఉద్యోగాల జాతర

  పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రి వర్గం భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ సంక్షేమ శాఖలోని గురుకులాల్లో 2,591 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆర్అండ్‌బీ శాఖలో 472 పోస్టులు మంజూరు చేసింది. పోలీస్ శాఖకు సంబంధించి సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పీఎస్‌లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  తెలంగాణలో ఉద్యోగాల జాతర

  పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రి వర్గం భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ సంక్షేమ శాఖలోని గురుకులాల్లో 2,591 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆర్అండ్‌బీ శాఖలో 472 పోస్టులు మంజూరు చేసింది. పోలీస్ శాఖకు సంబంధించి సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పీఎస్‌లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ భేటీ

  ఈ నెల 10వ తేదిన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల ముమ్మరం, సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం, రైతుబంధు నిధుల విడుదల, దళిత బంధు అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు హాజరుకానున్నారు.

  బీజేపీ పదాధికారుల సమావేశం.. దూరంగా బండి సంజయ్

  బీజేపీ పదాధికారుల సమావేశం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలు అందరూ హాజరయ్యారు. కాగా సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూరంగా ఉన్నారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో బిజీగా ఉండటంతో ఈ సమావేశానికి ఆయన వెళ్లలేదు. రాష్ట్ర పార్టీ తరఫున గుజ్టుల ప్రేమేందర్, డీకే అరుణ, కె.లక్ష్మణ్, మురళీధరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

  ఏపీ పెండింగ్ అంశాలపై తొలిసారి భేటీ

  ఆంధ్రప్రదేశ్ పెండింగ్ అంశాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర కేబినేట్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. విభజన చట్టంలో ఏపీ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన హామీలు, నెరవేర్చిన అంశాలు, ఇంకా మిగిలి ఉన్న అంశాలపై తొలిసారి చర్చించనున్నారు. ఉన్నత విద్యా సంస్థలు, ఎయిమ్స్, పోలవరం ప్రాజెక్టు సహా 34 అంశాలను అజెండాగా పెట్టుకున్నారు.కేేంద్ర, రాష్ట్రాల సమన్వయ కార్యదర్శి నేతృత్వంలో భేటీ జరగనుంది.

  భద్రతాధికారులతో అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

  కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా భద్రతాధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నేడు వివిధ రాష్ట్రాల్లోని PFI-SDPI కార్యాలయాలపై NIA సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలపై సమాచారం సేకరించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి NSA, హోమ్ శాఖ డీజీ, NIA ఉన్నతాధికారులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరుకానున్నారు.

  బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టితో అమిత్ షా భేటి

  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేడు బాలీవుడ్ బ‌డా డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టితో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో దేని గురించి చ‌ర్చించారో ఇంకా స్ప‌ష్ట‌త లేదు. అయితే ఈమ‌ధ్య‌కాలంలో బీజేపీ నాయ‌కులు వ‌రుస‌గా సినిమా స్టార్స్‌ను క‌లుస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన అమిత్ షా జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఇక బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా హీరో నితిన్‌తో స‌మావేశ‌మ‌య్యాడు. బీజేపీతో క‌లిసి పనిచేయాల‌ని వీరిని కోరేందుకే ఈ సమావేశాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.