మునుగోడులో బీజేపీ గెలిచి ఓడింది: కిషన్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిచి ఓడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతోనే టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు.గత ఎన్నికల్లో డిపాజిట్ రాని స్థాయి నుంచి రెండో స్థానానికి బీజేపీ చేరిన విషయాన్ని గమనించాలన్నారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.