• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చేతులతో సూర్యోదయాన్ని ఆపలేరు’

    తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును సినీ నటుడు, మాజీ ఎంపీ మురళిమోహన్‌ ఖండించారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ప్రారంభానికి ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ గేట్స్‌ను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం బాధాకరమన్నారు. ఉదయించే సూర్యోదయాన్ని ఆపడానికి చేతులు అడ్డుపెట్టడం మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బయటకు వస్తారని.. ఆయన సారథ్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతుందని మురళీమోహన్ చెప్పారు. మాజీ CM చంద్రబాబు నాయుడి గొప్పతనం మురళి మోహన్ గారి మాటల్లో#ChandrababuNaidu … Read more

    ‘చైతన్యతో ఉన్న ఇల్లుని మళ్లీ కొన్న సమంత’

    ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ సమంత నాగచైతన్య గురించి కీలక విషయాలు తెలిపారు. చైతన్య పెళ్లి తర్వాత తమ అపార్ట్ మెంట్లో ఓ ఇళ్లు కొనుగోలు చేసి సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ క్రమంలో చైతన్య మరో ఇంటిని కొనుగోలు చేసి వెళ్లాలనుకునేలోపే విడిపోయారన్నారు. ఆ క్రమంలో సమంత మరో ఇంటి కోసం చూడగా మంచి హౌస్ దొరకలేదంట. దీంతో అదే ఇంటికీ ఎక్కువ మనీ ఇచ్చి సమంత కొన్నట్లు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    చిరంజీవిపై కోట శ్రీనివాస‌రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ముర‌ళీమోహ‌న్

    సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు ఇటీవ‌ల చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. చిరంజీవి ఇండ‌స్ట్రీకి చేసిందేమి లేద‌ని అన్నాడు. కార్మికుల కోసం హాస్ప‌టల్ క‌ట్టించ‌డం అవ‌స‌రమా ముందు వాళ్లకు పని ఇప్పించండి ఎంత‌మంది ప‌నిలేక ఖాళీగా తిరుగుతున్నారు. హాస్పిట‌ల్ ఎంత‌మందికి అని క‌ట్టించ‌గ‌ల‌డు. నేను క‌ట్టించాను అని గొప్ప‌లు చెప్పుకోవ‌డానికా అన్నాడు. దీనిపై తాజాగా ముర‌ళీమోహ‌న్ స్పందించాడు. ఇంత‌కీ కోట శ్రీనివాస‌రావు ప‌రిశ్ర‌మ‌కు చేసిన మేలేంటో చెప్పాల‌ని అన్నాడు. చిరంజీవి చాలామందికి చాలార‌కాలుగా సాయ‌ప‌డ్డాడు. ఈరోజుకు ఏదో ఒక విదంగా సాయం చేస్తూనే ఉంటాడు. … Read more

    31 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్‌తో క‌లిసి న‌టిస్తున్న ముర‌ళీమోహ‌న్

    సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత ముర‌ళి మోహ‌న్, మెగాస్టార్ చిరంజీవి గ‌తంలో గ్యాంగ్‌లీడ‌ర్, త్రినేత్రుడు వంటి చిత్రాల్లో న‌టించాడు. ఈ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఆయ‌న న‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చిరంజీవితో క‌లిసి మ‌ళ్లీ గాడ్‌ఫాద‌ర్ సినిమాలో ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన విశేషాల‌ను ముర‌ళీమోహ‌న్ ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. చిరంజీవి ఒక‌సారి ఫోన్ చేసి మీ ఫోటోలు పంపించ‌మ‌న్నాడు. మీ నాన్న చ‌నిపోయిన‌ప్పుడు మీరు తెల్ల‌గ‌డ్డం, తెల్ల జుట్టుతో ఉన్నారు ఆ ఫోటోలు కావాల‌ని అడిగాడు. … Read more